Adipurush Trailer King Kong: ‘ఆది పురుష్’ ట్రైలర్ లో ‘కింగ్ కాంగ్’.. మీరు గమనించని ఎన్నో విషయాలు ఎక్సక్లూసివ్ గా మీకోసం

సంక్రాంతికి విడుదల చేసుకోవాల్సిన సినిమాని, జూన్ 16 వ తేదికి మేకర్స్ వాయిదా వేసుకునే రేంజ్ నెగటివిటీ అన్నమాట. ఇక ఆ తర్వాత గ్రాఫిక్స్ పై మూవీ టీం ప్రత్యేకమైన శ్రద్ద పెట్టింది. ఒక ప్రముఖ VFX కంపెనీ కి షాట్స్ మొత్తాన్ని పంపించి, కేవలం గ్రాఫిక్స్ వర్క్ కోసం ఆరు నెలలకు పైగా సమయం తీసుకొని చేసారు.

Written By: Vicky, Updated On : May 9, 2023 3:05 pm
Follow us on

Adipurush Trailer: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన ఆది పురుష్ ట్రైలర్ నేడు విడుదలై ఫ్యాన్స్ నుండి ఆడియన్స్ నుండి సెన్సషనల్ రెస్పాన్స్ ని దక్కించుకుంది. ఈ సినిమా టీజర్ గత ఏడాది విడుదలైనప్పుడు , ఒక రేంజ్ లో నెగటివిటీ ఏర్పడింది. 500 కోట్లు ఖర్చు చేసి కార్టూన్ సినిమాని తీసారా అంటూ అప్పట్లో ట్రోల్ల్స్ మారుమోగిపోయాయి.

ఎంతలా అంటే సంక్రాంతికి విడుదల చేసుకోవాల్సిన సినిమాని, జూన్ 16 వ తేదికి మేకర్స్ వాయిదా వేసుకునే రేంజ్ నెగటివిటీ అన్నమాట. ఇక ఆ తర్వాత గ్రాఫిక్స్ పై మూవీ టీం ప్రత్యేకమైన శ్రద్ద పెట్టింది. ఒక ప్రముఖ VFX కంపెనీ కి షాట్స్ మొత్తాన్ని పంపించి, కేవలం గ్రాఫిక్స్ వర్క్ కోసం ఆరు నెలలకు పైగా సమయం తీసుకొని చేసారు.దాని ఫలితం ట్రైలర్ లో స్పష్టం గా కనిపించింది.

Adipurush Trailer King Kong

ఇక ఈ సినిమా కోసం మోషన్ కాప్చర్ టెక్నాలజీ ని ఉపయోగించారని మొదటి నుండి చెప్తూ వస్తున్నారు. టీజర్ లో సరిగా వర్క్ చాలా వరకు బ్యాలన్స్ ఉండడం వల్ల ఈ టెక్నాలజీ ప్రభావం మనకి అంతగా తెలియలేదు. కానీ ట్రైలర్ చూసినప్పుడు మాత్రం అర్థం అయ్యింది. ఇందులో వానర సైన్యం కోసం మోషన్ కాప్చర్ టెక్నాలజీ ని ఉపయోగించారు. దాని ఫలితంగా వానర సైన్యం మొత్తం చాలా సహజం గా అనిపించింది, కొండంత ఎత్తుగా ఉన్న వానరులను చూస్తూ ఉంటే ‘కింగ్ కాంగ్’ ని చూసిన అనుభూతి కలిగింది. ఇంత అద్భుతమైన ఔట్పుట్ ఇస్తారని బహుశా ఫ్యాన్స్ కూడా ఊహించి ఉండరు.

Adipurush Trailer King Kong

 

ఇక ఈ ట్రైలర్ లో రావణాసురుడు సీతని అపహరించుకొని వెళ్లడం, ఆంజనేయుడు సీత కోసం లంక కి రావడం, లంక ని తన తోకతో తగలపెట్టడం వంటి ఘట్టాలను చూపించారు. అలా ట్రైలర్ కి సంబంధించిన ప్రతీ డీటెయిల్ అద్భుతంగా ఉంది, ఫోన్ లో టీవీ లో చూసినప్పుడే మనకి ఇలాంటి అనుభూతి కలిగితే, ఇక థియేటర్స్ లో చూసినప్పుడు ఎలాంటి అనుభూతి కలుగుతుందో తెలియాలంటే జూన్ 16 వరకు ఆగాల్సిందే.