మీనా ముగించింది.. ఖుష్బూ మొదలుపెట్టింది !

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా యాక్షన్ సినిమాల డైరెక్టర్ శివ కాంబినేషన్‌ లో వస్తోన్న సినిమా ‘అణ్ణాత్త’. ఇటివలే ఈ సినిమా షూటింగ్‌ ను పూర్తి చేశారు. గత వారం చెన్నైలో ఈ సినిమా డబ్బింగ్‌ కార్యక్రమాలు కూడా మొదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే రజనీకాంత్‌ తన పాత్రకు డబ్బింగ్‌ పూర్తి చేశారు. తాజాగా సీనియర్ హీరోయిన్ మీనా కూడా తన పాత్రకు డబ్బింగ్‌ చెప్పడం పూర్తి చేసింది. ఇక రేపటి నుండి ఖుష్బూ కూడా తన […]

Written By: admin, Updated On : August 5, 2021 4:22 pm
Follow us on

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా యాక్షన్ సినిమాల డైరెక్టర్ శివ కాంబినేషన్‌ లో వస్తోన్న సినిమా ‘అణ్ణాత్త’. ఇటివలే ఈ సినిమా షూటింగ్‌ ను పూర్తి చేశారు. గత వారం చెన్నైలో ఈ సినిమా డబ్బింగ్‌ కార్యక్రమాలు కూడా మొదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే రజనీకాంత్‌ తన పాత్రకు డబ్బింగ్‌ పూర్తి చేశారు. తాజాగా సీనియర్ హీరోయిన్ మీనా కూడా తన పాత్రకు డబ్బింగ్‌ చెప్పడం పూర్తి చేసింది.

ఇక రేపటి నుండి ఖుష్బూ కూడా తన డబ్బింగ్ ను స్టార్ట్ చేయనుంది. అలాగే ఈ సినిమాలో కీర్తి సురేష్‌, ప్రకాష్‌ రాజ్‌ తమతమ పాత్రలకు డబ్బింగ్‌ చెప్పడానికి ఈ నెల మూడో వారం నుండి డేట్లు ఇచ్చారు. ఇక ఈ సినిమాని నవంబర్ 4వ తేదీన విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. కాబట్టి, అప్పటిలోగా ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేయాలని పక్కాగా ప్లాన్ చేస్తున్నారు.

నిజానికి, రజినీకాంత్ ఈ సినిమాని అసలు ఈ ఏడాది పూర్తి చేస్తాడా? లేదా అనే ఫ్యాన్స్ ఆందోళన చెందారు. అయితే, రజిని కరోనా కాలంలో కూడా రామోజీ ఫిలిం సిటీలో లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేసుకుని ఈ సినిమా షూటింగ్ పార్ట్ ను పూర్తి చేశారు. మధ్యలో అనారోగ్యం వచ్చినా రజిని చిన్న గ్యాప్ తీసుకుని మళ్ళీ షూట్ మొదలుపెట్టారు.

ఇక ఈ సినిమాలో రజిని సరసన మీనా, ఖుష్బూ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మరోపక్క సూపర్ స్టార్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా రజినీ – శివ కాంబినేషన్ పట్ల చాలా ఆసక్తిని కనబరుస్తున్నారు. సినిమా పోస్టర్ కూడా ఓ రేంజ్ లో ఉండటం.. ముఖ్యంగా రజిని లుక్స్ అదిరిపోయేలా ఉండటంతో ఈ సినిమాకి మంచి బజ్ క్రియేట్ అయింది. కాగా ప్రముఖ నిర్మాత కళానిధి మారన్‌ సన్‌ పిక్చర్స్‌ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.