1980 లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ` ది బర్నింగ్ ట్రైన్ ‘ చిత్రం తో కెరీర్ ఆరంభించిన ఖుష్బూ హీరోయిన్ గా తొలి సారి మెరిసింది మాత్రం తెలుగు తెర పైనే .. . 1986 లో వచ్చిన ” కలియుగ పాండవులు ” చిత్రం తో హీరోయిన్ గా మారిన ఖుష్బూ ఆ తరవాత తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో కథానాయికగా ఒక వెలుగు వెలిగింది. తెలుగులో వెంకటేష్ , నాగార్జున వంటి సీనియర్ స్టార్ హీరోలతో నటించి ఆ తరవాత తమిళం లోకి ఎంటర్ అయ్యింది. అక్కడ ఆమె వరుస విజయాలను అందుకుంది. రజనీకాంత్ , కమలహాసన్ తో పాటు చాలా మంది తమిళ హీరోలతో జోడీగా నటించి ఇక అక్కడే స్థిరపడి పోయింది. అలాంటి ఖుష్బూ చాల ఏళ్ళ గ్యాప్ తరవాత రజనీకాంత్ సరసన ” అన్నాత్తే ” అనే సినిమా లో చేస్తోంది. తెలుగులో శౌర్యం , శంఖం చిత్రాలు చేసి తమిళంలో ” వీరం , వేదాళం , వివేగం , విశ్వాసం ” వంటి భారీ చిత్రాలతో స్టార్ డైరెక్టర్ గా ఎదిగిన శివ దర్శకత్వంలో ఈ సినిమా నిర్మితమవుతోంది.
కాగా ఈ చిత్రంలోరజనీకాంత్ , ఖుష్బూల మీద ఒక పాట కూడా ఉంటుందట . సుమారు పాతికేళ్ల గ్యాప్ తరవాత రజనీకాంత్ సరసన హీరోయిన్ గా అవకాశం రావడం తో ఖుష్బూ ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతోందట … గతంలో రజనీ కాంత్ సరసన ఖుష్బూ చేసిన ‘అన్నామలై’ ( తెలుగులో కొండపల్లి రాజా ) .. ‘మన్నన్’ ( తెలుగులో ఘరానా మొగుడు ) .. ‘పాండియన్’ ( డబ్బింగ్ ; సీక్రెట్ పోలీస్ ) సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. మళ్లీ ఇంతకాలానికి రజనీ కాంత్ సరసన నటించే అవకాశం రావడం తో పాటు , ఇద్దరికీ ఒక పాట కూడా ఉండటం పట్ల ఖుష్బూ తెగ ఆనందాన్ని వ్యక్తం చేస్తోందట. సన్ పిక్చర్స్ వారు భారీగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ఖుష్బూ తో పాటు మీనా .. కీర్తి సురేశ్ కూడా నటించనుండటం విశేషం.
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Khushboo to act the fourth time with rajinikanth
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com