Khiladi Girls vs Kirrak Boys Finale: కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ సీజన్ 2 గ్రాండ్ ఫినాలే ముగిసింది. ఉత్కంఠ మధ్య ఇరు జట్లలో ఒకరు విజేతగా నిలిచారు. విన్నర్స్ క్రేజీ ఫోజులివ్వగా ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ సీజన్ 2 టైటిల్ అందుకుంది ఎవరో చూద్దాం..
స్టార్ మా గత ఏడాది కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్(KiraackBoysKhiladiGirls2) పేరుతో గేమ్ షో ఆరంభించింది. ఇది సెలబ్రిటీ షో. బుల్లితెర సెలెబ్స్ అయిన అమ్మాయిలు ఒక జట్టు, అబ్బాయిలు మరొక జట్టుగా ఏర్పడి పోటీపడాల్సి ఉంటుంది. సీరియల్ నటులు, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ భాగమైన ఈ షోకి మంచి ఆదరణ దక్కింది. ముఖ్యంగా అనసూయ భరద్వాజ్ రీ ఎంట్రీ ఇవ్వడం షోకి మరింత ప్రాచుర్యం తెచ్చింది. కిరాక్ బాయ్స్ కి శేఖర్ మాస్టర్, ఖిలాడీ గర్ల్స్ కి అనసూయ(ANASUYA BHARADWAJ) ప్రాతినిథ్యం వహించారు. అనసూయ ఎప్పటిలానే తనలోని హాట్ యాంగిల్ బయటకు తీసి షో గురించి జనాలు మాట్లాడుకునేలా చేసింది.
శేఖర్ మాస్టర్ చొక్కా విప్పగా, అనసూయ సైతం తన టాప్ తొలగించి వార్తల్లో నిలిచింది. దీనిపై విమర్శలు తలెత్తాయి. షోకి పబ్లిసిటీ తేవడం కోసం అనసూయ అలా చేసింది అనేది నిజం. ఇక విమర్శలకు తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చింది. సీజన్ 1 విజేతలుగా బాయ్స్ నిలిచారు. కిరాక్ బాయ్స్ టైటిల్ సొంతం చేసుకున్నారు. సీజన్ వన్ సక్సెస్ నేపథ్యంలో సీజన్ 2 ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. ఈసారి ఎలాగైనా టైటిల్ అందుకోవాలని గర్ల్స్.. బాయ్స్ కి గట్టి పోటీ ఇచ్చారు.
Also Read: Anasuya : తోటి జడ్జితో అనసూయ రొమాన్స్, ఏకిపారేస్తున్న నెటిజన్స్!
అటు గ్లామర్ షోతో పాటు ఆసక్తి రేపే గేమ్స్ తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారు. సీజన్ 2లో అనసూయ కొంచెం పద్ధతిగా కనిపించింది. సాధ్యమైనంత వరకు నిండైన బట్టల్లో కనిపించే ప్రయత్నం చేసింది. కొన్ని వారాలుగా షో నడుస్తుంది. జూన్ 22న గ్రాండ్ ఫినాలే(KiraackBoysKhiladiGirls Season 2 grand finale) నిర్వహించారు. ఇరు జట్లలో విన్నర్ ఎవరనే ఉత్కంఠ కొనసాగింది. అనూహ్యంగా అబ్బాయిల మీద అమ్మాయిలు పై చేయి సాధించారు. టైటిల్ ఎగరేసుకుపోయారు. గేమ్స్ ముగిసే నాటికి అత్యధిక అమౌంట్ తో బాయ్స్ ని గర్ల్స్ డామినేట్ చేశారు.
జడ్జెస్ అనసూయ, శేఖర్ మాస్టర్ విజేతలను ప్రకటించారు. ఖిలాడీ గర్ల్స్ సీజన్ 2 విన్నర్స్ గా నిలిచారు. దాంతో అనసూయ ఆనందానికి హద్దు లేకుండాపోయింది. గర్ల్స్ ఈ విజయాన్ని గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకున్నారు. ఈ క్రమంలో క్రేజీ ఫోజిలిచ్చారు. సదరు ఫోటోలు వైరల్ అవుతున్నాయి. స్టార్ మా యాజమాన్యం ఖిలాడీ గర్ల్స్ కి అభినందనలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఖిలాడీ గర్ల్స్ విన్నింగ్ మూమెంట్స్ కి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓ లుక్ వేయండి.