Khaleja re-release 3-day collection : సూపర్ స్టార్ మహేష్ బాబు(Superstar Mahesh Babu) నటించిన ‘ఖలేజా'(Khaleja Movie) చిత్రం అప్పట్లో ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమాని మళ్ళీ ఇన్నాళ్లకు రీ రిలీజ్ చేసారు. అప్పట్లో ఫ్లాప్ అయినా ఈ చిత్రానికి ఇప్పుడు బ్రహ్మరథం పట్టారు. వాస్తవానికి అప్పటికీ ఇప్పటికీ ఒక జనరేషన్ మారిపోయింది. అప్పటి జనరేషన్ కి ఈ చిత్రం నచ్చలేదు, కానీ ఇప్పటి జనరేషన్ కి మాత్రం ఈ చిత్రం తెగ నచ్చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ జనరేషన్ ఆడియన్స్ ఈ చిత్రాన్ని కల్ట్ క్లాసిక్ చిత్రాల లిస్ట్ లోకి చేర్చారు. ఇలాంటి రిపీట్ వేల్యూ ఉన్న సినిమాని అప్పటి జనాలు ఎలా ఫ్లాప్ చేశారు అంటూ అప్పటి ఆడియన్స్ ని తప్పుబడుతూ తిడుతున్నారు. అయితే రీ రిలీజ్ ఈ చిత్రం అద్భుతాల్ని నెలకొల్పుతూ ముందుకు దూసుకుపోతుంది.
మొదటి రోజు దాదాపుగా 5 కోట్ల 30 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను ప్రపంచవ్యాప్తంగా రాబట్టిన ఈ సినిమా, ఓవర్సీస్ లో మాత్రం ఆల్ టైం రికార్డు గా నిల్చింది. నార్త్ అమెరికా లో లక్ష డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన మొట్టమొదటి సినిమాగా రికార్డ్స్ కి ఎక్కింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో రెండవ రోజు, మూడవ రోజు కూడా ఈ సినిమాకు డీసెంట్ స్థాయి గ్రాస్ వసూళ్లను రాబట్టింది. రెండవ రోజు రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి కోటి 20 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, మూడవ రోజు 75 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 7 కోట్ల 35 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇక నేటి నుండి పెద్ద స్థాయిలో గ్రాస్ నమోదయ్యే అవకాశాలు లేకపోవడంతో, ఈ మూడు రోజుల్లో వచ్చిన వసూళ్లే ఫైనల్ కలెక్షన్స్ గా పరిగణించొచ్చు.
Also Read : 2వ రోజు కూడా ఇరగకుమ్మేసిన ‘ఖలేజా’..నార్త్ అమెరికాలో ప్రభంజనం..ఇప్పట్లో ఆగేలా లేదు!
ఓవరాల్ గా ఇప్పటి వరకు టాలీవుడ్ లో రీ రిలీజ్ అయిన సినిమాల గ్రాస్ వసూళ్లను పరిశీలిస్తే ఖలేజా ఆల్ టైం టాప్ 3 స్థానం లో నిల్చినట్టు చెప్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. మొదటి స్థానం లో 9 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి మురారి చిత్రం ఉండగా, రెండవ స్థానం లో 8 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి ‘గబ్బర్ సింగ్’ చిత్రం నిల్చింది. ఇక ఆ తర్వాతి స్థానం లో ఖలేజా నిలబడింది. ఇదే చిత్రాన్ని మహేష్ బాబు పుట్టినరోజు నాడు విడుదల చేసి ఉంటే కచ్చితంగా నెంబర్ 1 స్థానం లో ఉండేదని ఆయన అభిమానులు సోషల్ మీడియా ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కెరీర్ లో ఆల్ టైం క్లాసిక్ గా నిల్చిన అతడు చిత్రాన్ని ఆగష్టు 9 న విడుదల చేయబోతున్నారు.