Salaar Movie: సలార్ కోసం భారీ రిస్క్ తీసుకున్న KGF మేకర్స్.. తేడా అయితే చావు దెబ్బే!

Salaar Movie: ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద KGF చాప్టర్ 2 విద్వాంసం ఇప్పటికి ఏ మాత్రం తగ్గలేదు..బాలీవుడ్ లో ఈ చిత్రం ఇప్పటికి కూడా డబల్ డిజిట్ నంబర్స్ ని వసూలు చేస్తూ ప్రభంజనం సృష్టిస్తూ ముందుకి దూసుకుపోతుంది..ఇలాంటి వసూళ్లు వాళ్ళు చూసి ఎన్నో ఏళ్ళు అయ్యింది అనే చెప్పాలి..కేవలం వారం రోజుల్లోనే బాలీవుడ్ లో 255 కోట్ల రూపాయిల వసూలు చేసిన ఈ చిత్రం..ప్రపంచ వ్యాప్తంగా వారం రోజులకు గాను అక్షరాలా 720 కోట్ల […]

Written By: Neelambaram, Updated On : April 22, 2022 11:49 am
Follow us on

Salaar Movie: ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద KGF చాప్టర్ 2 విద్వాంసం ఇప్పటికి ఏ మాత్రం తగ్గలేదు..బాలీవుడ్ లో ఈ చిత్రం ఇప్పటికి కూడా డబల్ డిజిట్ నంబర్స్ ని వసూలు చేస్తూ ప్రభంజనం సృష్టిస్తూ ముందుకి దూసుకుపోతుంది..ఇలాంటి వసూళ్లు వాళ్ళు చూసి ఎన్నో ఏళ్ళు అయ్యింది అనే చెప్పాలి..కేవలం వారం రోజుల్లోనే బాలీవుడ్ లో 255 కోట్ల రూపాయిల వసూలు చేసిన ఈ చిత్రం..ప్రపంచ వ్యాప్తంగా వారం రోజులకు గాను అక్షరాలా 720 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసి బాహుబలి పార్ట్ 2 తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా సరికొత్త చరిత్ర సృష్టించింది..ఈ వసూళ్లు అన్ని కూడా కేవలం వంద కోట్ల రూపాయిల బడ్జెట్ పెట్టి తీసిన సినిమాతో వచ్చింది..విడుదలకి ముందు ఒక్క రేంజ్ క్రేజ్ ఉన్నప్పటికీ, ఆ చిత్ర నిర్మాతలు ఒక్క ప్రాంతం కి కూడా అమ్మకుండా కమిషన్ బేసిస్ మీద విడుదల చేసి కనివిని ఎరుగని రేంజ్ లో లాభాల్ని అర్జించారు నిర్మాతలు.

Salaar Movie

కానీ ప్రస్తుతం వారు ప్రభాస్ తో తీస్తున్న సలార్ సినిమాకి మాత్రం భారీ స్థాయి బడ్జెట్ పెడుతున్నారు అట..30 శాతం షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా , షూటింగ్ మొత్తం పూర్తి చేసుకునే సమయానికి దాదాపుగా 200 కోట్ల రూపాయిలు బడ్జెట్ అయ్యేట్టు ఉంది అని ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న వార్త..కానీ ప్రభాస్ వంటి క్రేజ్ ఉన్న హీరో తో ప్రశాంత్ నీల్ వంటి దర్శకుడు చేస్తున్న సినిమా కాబట్టి 200 కోట్ల రూపాయిల బడ్జెట్ పెట్టినా ప్రీ రిలీజ్ బిజినెస్ లోనే సుమారు 100 కోట్ల రూపాయలకు పైగానే టేబుల్ ప్రాఫిట్స్ వస్తుంది..దీనికి అదనంగా డిజిటల్ మరియు సెట్ లైట్ రైట్స్ ద్వారా మరో 250 కోట్ల రూపాయిల లాభం..కాబట్టి 200 కోట్ల రూపాయిల బడ్జెట్ పెద్ద టాస్క్ ఏమి కాదు అనే చెప్పొచ్చు..కానీ ఈ సినిమాని కూడా నిర్మాతలు ఎవ్వరికి అమ్మబోవడం లేదు అట..కేవలం కమిషన్ బేసిస్ మీదనే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ చెయ్యబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

Also Read: Mahesh Babu CM Jagan: మహేష్ సినిమా పై సీఎం జగన్ కన్ను.. హడాలిపోతున్న ఫాన్స్

KGF చాప్టర్ 2 కి కూడా కమిషన్ బేసిస్ మీదనే బిజినెస్ చేసి కేవలం థియేట్రికల్ రన్ ద్వారానే వారం రోజుల్లో దాదాపుగా 400 కోట్ల రూపాయిల లాభాలు అర్జించారు..ప్రతుతం ఉన్న కల్లెక్షన్స్ ట్రెండ్ చూస్తుంటే మరో 200 కోట్లు లాభాలు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు అని ట్రేడ్ వర్గాల అంచనా..కమిషన్ బేసిస్ మీద ఈ స్థాయి లాభాలు రావడం తో సలార్ కి కూడా అదే ఫాలో అవుదాం అనే ఆలోచనలో ఉన్నారు అట నిర్మాతలు..కానీ భారీ బడ్జెట్ సినిమా కాబట్టి ఒక్కవేల హిట్ అయితే KGF కి మించిన లాభాల్ని చూస్తారు..కానీ ఫ్లాప్ అయితే మాత్రం భారీ నష్టాలు తప్పులు..ఎందుకంటే ఒక్క సినిమా ఆడినట్టు అన్ని సినిమాలు ఆడుతాయి కచ్చితంగా అనుకోవడం నిజంగా రిస్క్ తో కూడిన వ్యవహారం..కానీ సలార్ సినిమా అద్భుతంగా వస్తుంది అని..కచ్చితంగా ఈ సినిమా KGF ని మించి విజయం సాధిస్తుంది అని ఆ చిత్ర మేకర్స్ గట్టి నమ్మకం తో ఉన్నారు..చూడాలి మరి ఈ సినిమా కూడా KGF స్థాయిలో లాభాలు తెస్తుందో లేదో అనేది.

Also Read: KGF 2 Collections: ఫస్ట్ వీక్ కుమ్మేసింది.. ఎన్ని కోట్లు వచ్చాయంటే ?

Recommended Videos:

Tags