https://oktelugu.com/

కేజీఎఫ్ 2 అప్డేట్: అభిమానులకి డిసెంబర్‌ 21న గుడ్ న్యూస్

కన్నడ హీరో కేజీఎఫ్ సినిమా ఎటువంటి అంచనాలు లేకుండా దేశంలో అనేక భాషలలో రిలీజ్ అయ్యి ఎంతటి ప్రభంజనం సృష్టించిందో ఆందరికి తెలుసు.మూవీలోని ఎలేవేషన్ షాట్స్ కి కుర్రకారు వెర్రెత్తిపోయారు. విడుదలయిన అన్ని రాష్ట్రాలలోను ఘన విజయం సాధించింది. ఇక ఈ మూవీ కి కొనసాగింపు ఉంటుందని దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రకటించటం జరిగింది. ఎప్పుడొప్పుడు కేజీఎఫ్ చాప్టర్ 2 వస్తుందా అని అభిమానులు ఎదురు చూపులు చూస్తున్నారు. కరోనా వల్ల షూటింగ్స్ జరగక ఆలస్యం జరిగింది. […]

Written By:
  • admin
  • , Updated On : December 19, 2020 / 08:06 PM IST
    Follow us on


    కన్నడ హీరో కేజీఎఫ్ సినిమా ఎటువంటి అంచనాలు లేకుండా దేశంలో అనేక భాషలలో రిలీజ్ అయ్యి ఎంతటి ప్రభంజనం సృష్టించిందో ఆందరికి తెలుసు.మూవీలోని ఎలేవేషన్ షాట్స్ కి కుర్రకారు వెర్రెత్తిపోయారు. విడుదలయిన అన్ని రాష్ట్రాలలోను ఘన విజయం సాధించింది. ఇక ఈ మూవీ కి కొనసాగింపు ఉంటుందని దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రకటించటం జరిగింది. ఎప్పుడొప్పుడు కేజీఎఫ్ చాప్టర్ 2 వస్తుందా అని అభిమానులు ఎదురు చూపులు చూస్తున్నారు. కరోనా వల్ల షూటింగ్స్ జరగక ఆలస్యం జరిగింది. ప్రస్తుతానికి హైదరాబాద్ లో వేసిన ప్రత్యేక బంగారు గనుల సెట్లో షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించి దర్శకుడు తన ట్విట్టర్ ఖాతాలో చేసిన ఒక పోస్ట్ తో అభిమానులలో ఉత్తేజం వచ్చేసింది.

    Also Read: సౌత్ వాళ్లకు అలా కనిపిస్తే నచ్చదు… సమంత సంచలన కామెంట్స్

    కేజీఎఫ్ చాప్టర్ 1 రెండు సంవత్సరాల క్రితం అనగా 2018 డిసెంబర్‌ 21వ తేదీన విడుదలయ్యి విజయవంతమయ్యింది . అలానే గత ఏడాది డిసెంబర్‌ 21వ తేదీన కేజీఎఫ్- 2 నుంచి హీరో ‘యశ్’‌ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ విడుదల చేశారు. ఇప్పుడు అదే సెంటిమెంట్ ని ఫాలో అవుతూ దర్శకుడు డిసెంబర్‌ 21 న అభిమానులకి ఒక బహుమతి ఇవ్వనున్నట్లు ప్రకటించటం జరిగింది. ప్రశాంత్ నీల్ తన ట్విట్టర్ లో ”కేజీఎఫ్‌-2 షూటింగ్ చివరి దశకు చేరింది. ప్రతిఏడాది డిసెంబర్‌ 21న అభిమానులను సర్‌ప్రైజ్‌ చేసిన మేము ఈ ఏడాది కూడా అదే ఆచారాన్ని ఫాలో అవుతున్నాం. డిసెంబర్‌ 21న ఉదయం 10 గంటల 8 నిమిషాలకు స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ ఇవ్వబోతున్నాం. సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు” అని పోస్ట్ చేశారు. అప్పటి నుండి ఈ న్యూస్ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.

    Also Read: ‘నేడే విడుదల’ ఫస్ట్ లిరికల్ సాంగ్..

    బహుశా మూవీ కి సంబందించిన టీజర్ ని రిలీజ్ చేసి అలాగే మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ ఉంటుందని సమాచారం. ఈ మూవీలో హీరో యశ్ కి జోడిగా మొదటి పార్ట్ లో చేసిన శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ చిత్రంలో పవర్ ఫుల్ విలన్ గా అధీరా పాత్రలో బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ నటిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాలో రవీనా టాండన్‌, ప్రకాశ్‌ రాజ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. మొదటి పార్ట్ కి సూపర్ మ్యూజిక్ ఇచ్చిన రవి బస్రూర్ నే ఈ పార్ట్ కి కూడా అందిస్తున్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    Tags