Shock To Tarak Fans: తారక్ ఫాన్స్ కి కోలుకోలేని షాక్ KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్

Shock To Tarak Fans: RRR మూవీ భారీ విజయం తో ఫుల్ జోష్ మీద ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన తదుపరి చిత్రం కొరటాల శివ తో చెయ్యబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమా షూటింగ్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఈ నెల 20 వ తారీఖున ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా అధికారికంగా తెలియచేయనున్నారు ఆ చిత్ర నిర్మాతలు..అంతే కాకుండా ఎన్టీఆర్ త్వరలో KGF సిరీస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ […]

Written By: Neelambaram, Updated On : May 16, 2022 6:39 pm
Follow us on

Shock To Tarak Fans: RRR మూవీ భారీ విజయం తో ఫుల్ జోష్ మీద ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన తదుపరి చిత్రం కొరటాల శివ తో చెయ్యబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమా షూటింగ్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఈ నెల 20 వ తారీఖున ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా అధికారికంగా తెలియచేయనున్నారు ఆ చిత్ర నిర్మాతలు..అంతే కాకుండా ఎన్టీఆర్ త్వరలో KGF సిరీస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఒక్క సినిమా చెయ్యబోతున్నాడు అనే విషయం మన అందరికి తెలిసిందే..ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా ఈ నెల 20 వ తారీఖున విడుదల చెయ్యబోతున్నారు అనే వార్త అభిమానుల్లో ఫుల్ జోష్ ని నింపింది..అయితే రెండు రోజుల నుండి సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న ఒక్క వార్త , ఎన్టీఆర్ అభిమానులను కలవర పెడుతుంది..

Jr NTR

Also Read: KCR BJP Congress: కేసీఆర్ టార్గెట్ ఫిక్స్.. బీజేపీ కూడా అదే దారి.. కాంగ్రెస్ కు ఏంటీ పరిస్థితి?

అదేమిటి అంటే KGF నిర్మాతలు ఈ ఏడాది చివరి నుండి KGF చాప్టర్ 3 షూటింగ్ ప్రారంభం అవుతుంది అని అధికారికంగా ఇటీవల జరిగిన ఒక్క ఇంటర్వ్యూ లో ప్రకటించారు ..ప్రస్తుతం సలార్ షూటింగ్ లో ఫుల్ బిజీ గా గడుపుతున్న ప్రశాంత్ నీల్, ఈ సినిమా పూర్తి అవ్వగానే KGF చాప్టర్ 3 షూటింగ్ ని ప్రారంభిస్తారు అని విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం..దీని వల్ల ఎన్టీఆర్ మరియు ప్రశాంత్ నీల్ సినిమా సెట్స్ పైకి వెళ్ళడానికి చాలా సమయమే పటేటట్టు ఉంది..KGF చాప్టర్ 3 సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదల అయ్యే సమయానికి 2024 వరుకు సమయం పట్టొచ్చు..అప్పటి వరుకు ఎన్టీఆర్ అభిమానులు ఈ క్రేజీ కాంబినేషన్ కోసం ఎదురు చూడక తప్పదు..దీనితో అసలు ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్తుందా లేదా అనే భయం ఎన్టీఆర్ అభిమానుల్లో నెలకొంది..

Prashanth Neel

ఎప్పుడు ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవుతుందో అని వార్త వినాల్సి వస్తుందో అని ఆయన అభిమానులు కంగారు పడుతున్నారు..ఎందుకంటే గతం లో కూడా ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కాల్సిన సినిమా కొన్ని అనుకోని కారణాల వల్ల క్యాన్సిల్ అయ్యింది..అలా ఈ ప్రాజెక్ట్ కూడా క్యాన్సిల్ అవుతుందేమో అనే భయం లో ఉన్నారు ఎన్టీఆర్ అభిమానులు.

Also Read: Pranitha Subhash Seemantham: పసుపు పచ్చని చీరలో బాపు బొమ్మకు సీమంతం

Recommended Videos:

Tags