https://oktelugu.com/

KGF Chapter2: కేజీఎఫ్​ చాప్టర్​2 షూటింగ్ ఇంకా పూర్తి కాలేదట?

KGF Chapter2:  ప్రస్తుతం భారతీయ సినిమా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ ప్రాజెక్టుల్లో ఆర్​ఆర్​ఆర్​ ఒకటైతో.. ఇంకొటి కేజీఎఫ్​ పార్ట్​ 2. దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా ఆర్​ఆర్​ఆర్​.. ఇందులో రామ్​చరణ్​, తారక్​ హీరోలుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పాటలు, టీజర్​లు నెట్టింట ఓ ఊపు ఊపాయి. కాగా ఇటీవలే ఈ సినిమా నుంచి వచ్చి ట్రైలర్​ అందరి అంచనాలను పెంచేసింది. మరోవైపు కేజీఎఫ్​ కూడా అంతో […]

Written By: , Updated On : December 24, 2021 / 12:54 PM IST
Follow us on

KGF Chapter2:  ప్రస్తుతం భారతీయ సినిమా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ ప్రాజెక్టుల్లో ఆర్​ఆర్​ఆర్​ ఒకటైతో.. ఇంకొటి కేజీఎఫ్​ పార్ట్​ 2. దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా ఆర్​ఆర్​ఆర్​.. ఇందులో రామ్​చరణ్​, తారక్​ హీరోలుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పాటలు, టీజర్​లు నెట్టింట ఓ ఊపు ఊపాయి. కాగా ఇటీవలే ఈ సినిమా నుంచి వచ్చి ట్రైలర్​ అందరి అంచనాలను పెంచేసింది.

KGF Chapter2:

KGF Chapter2:

మరోవైపు కేజీఎఫ్​ కూడా అంతో భారీ క్రేజ్​ను సంపాదించుకున్న సంగతి తెలిసిందే.. ప్రశాంత్ నీల్​ దర్శకత్వంలో జీఎఫ్ చాప్టర్ 1 కి సీక్వెల్ గా “కేజీఎఫ్ చాప్టర్ 2” తెరకెక్కనుంది. ఇప్పటికీ ఈ సినిమా షూటింగ్​ పూర్తి చేసుకున్న చిత్రయూనిట్​… ప్రస్తుతం పోస్ట్​ ప్రొడక్షన్​ పనుల్లో బిజీగా ఉంది.

ALSO Read: కేజీఎఫ్​ చాప్టర్​2 నుంచి ఇంట్రెస్టింగ్​ బజ్​.. 3డీలో సినిమా రిలీజ్​?

అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా మేకర్స్ మరోసారి షూటింగ్ పనుల్లో పడ్డారట. కొన్ని ప్యాచ్​ వర్క్​లు మగిలున్న నేపథ్యంలో త్వరగా పూర్తి చేయాలని అనుకుంటున్నట్లు సమాచారం. హీరో యశ్​, హీరోయిన్ శ్రీనిథిల మధ్య సన్నివేశాలను ఇందులో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ షూటింగ్​తో మొత్తం ప్రొడక్షన్​ వర్క్​ పూర్తయిపోతుందట. ఇప్పటికే ప్రశాంత్​ నీల్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభించి.. ఫుల్ బిజీలో ఉన్నారు. ప్రవంచ వ్యాప్తంగా వచ్చే ఏడాది ఏప్రిల్ 4న ఈ సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే.

ALSO Read: KGF 2: అధీరా పాత్రకు డబ్బింగ్‌ పూర్తి చేసిన సంజయ్ దత్