https://oktelugu.com/

కెజిఎఫ్ 2 క్లైమాక్స్ కేక పుట్టిస్తుందట..

గత కొన్నేళ్లలో సౌత్ నుంచి పాన్ ఇండియా చిత్రాల వరవడి బాగానే పెరిగింది. తెలుగులో బాహుబలి సిరీస్ సాధించి ఘన విజయం ఎందరికో స్ఫూర్తి గా నిలిచింది. అలాంటి దారిలో వచ్చిన సినిమాయే `కె .జి .ఎఫ్ . సుమారు 80 కోట్ల బడ్జట్ తో రూపొందిన ఈ చిత్రం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మొత్తం ప్రపంచ వ్యాప్తంగా 250 కోట్ల గ్రాస్ వసూలు రాబట్టింది. అంతేకాదు యాక్షన్ సన్నివేశాల రూపకల్పన లో ఒక కొత్త […]

Written By:
  • admin
  • , Updated On : April 4, 2020 / 12:52 PM IST
    Follow us on


    గత కొన్నేళ్లలో సౌత్ నుంచి పాన్ ఇండియా చిత్రాల వరవడి బాగానే పెరిగింది. తెలుగులో బాహుబలి సిరీస్ సాధించి ఘన విజయం ఎందరికో స్ఫూర్తి గా నిలిచింది. అలాంటి దారిలో వచ్చిన సినిమాయే `కె .జి .ఎఫ్ . సుమారు 80 కోట్ల బడ్జట్ తో రూపొందిన ఈ చిత్రం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మొత్తం ప్రపంచ వ్యాప్తంగా 250 కోట్ల గ్రాస్ వసూలు రాబట్టింది. అంతేకాదు యాక్షన్ సన్నివేశాల రూపకల్పన లో ఒక కొత్త ట్రెండ్ కి నాంది పలికింది.

    అలా 2018లో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ , హీరో యష్ తో కలిసి ప్రభంజనం సృష్టించారు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన కెజిఎఫ్ భారీ విజయం అందుకుంది. ఇక ఈ చిత్రానికి కొనసాగింపుగా కెజిఎఫ్ 2 రెడీ అవుతోంది . ఇప్పటికే షూటింగ్ పార్ట్ దాదాపు పూర్తి చేసుకున్న ఈ మూవీ పరిస్థితులన్నీ చక్కబడితే 2020 అక్టోబర్ 23న విడుదల కానుంది.కాగా కెజిఎఫ్ 2 క్లైమాక్స్ విషయంలో ఓ ప్రత్యేకత ఉందని తెలిసింది. .

    కెజిఎఫ్ 2 మూవీలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ప్రధాన విలన్ అధీరా రోల్ చేస్తుండటం విశేషం. కాగా బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్ దేశ ప్రధానిగా కీ రోల్ చేస్తోంది. కాగా కెజిఎఫ్ 2 లో రాఖి భాయ్ ( హీరో పాత్ర )నిర్మించుకున్న సామ్రాజ్యం కూల్చేయడమే కాకుండా హీరో మరణానికి కూడా ఆ పాత్రే కారణం అవుతుందట. ప్రత్యర్థులను చంపివేసి `కెజిఎఫ్` ప్రాంతానికి కింగ్ గాఎదిగిన హీరో రాఖీని ప్రభుత్వ సైన్యం సహకారంతో రవీనా టాండన్ చంపించి వేస్తుందని తెలుస్తోంది. అలా తల్లి కిచ్చిన మాట ప్రకారం రాఖి భాయ్ `రాజు` హోదాలో ఆనందంగా చనిపోతాడని తెలుస్తోంది. అలా ` కె జి ఎఫ్ ౨` క్లైమాస్స్ లో రాఖీ భాయ్ ( హీరో యాష్ ) చనిపోతాడని రూఢీగా తెలుస్తోంది.