KGF 2 4 Days Collections: ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రస్తుతం KGF చాప్టర్ 2 మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామి ని సృష్టిస్తూ ముందుకు దూసుకుపోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..మొదటి రోజు మొదటి ఆట నుండే అంచనాలను మించి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం..ఆ రోజు నుండి నేటి వరుకు ఏ మాత్రం తగ్గుముఖం పట్టని బాక్స్ ఆఫీస్ ట్రెండ్ ని కొనసాగిస్తూ ట్రేడ్ లో సరికొత్త బెంచ్ మార్కు ని బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రతి రోజు క్రియేట్ చేస్తూనే ఉంది..ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ మూవీ రన్ ని చూస్తుంటే కచ్చితంగా ఫుల్ రన్ లో అల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచే అవకాశం కూడా ఉంది అని అక్కడి ట్రేడ్ వర్గాల అంచనా..ప్రస్తుతం అక్కడ అల్ టైం టాప్ 3 చిత్రాలుగా బాహుబలి 2 , దంగల్ మరియు #RRR మూవీ లు ఉన్నాయి..బాహుబలి రికార్డు ని అయితే #RRR సైతం బ్రేక్ చెయ్యలేకపోయింది..కానీ KGF వీక్ డేస్ లో కూడా ఇదే ట్రెండ్ ని కొనసాగిస్తే కచ్చితంగా బాహుబలి 2 రికార్డ్స్ ని కొడుతోంది అని ట్రేడ్ వర్గాల అంచనా..నాలుగు రోజులకు గాను ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఎంత వసూలు చేయిందో ఇప్పుడు మనం చూడబోతున్నాము.

ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఈ సినిమా మన టాలీవుడ్ లో కూడా అద్భుతమైన వసూళ్లను ఈ వీకెండ్ సొంతం చేసుకుంది..ఇక్కడ దాదాపుగా నాలుగు రోజులకు గాను 53 కోట్ల రూపాయలకు పైగా షేర్ ని వసూలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆల్ టైం రికార్డు సృష్టించిన దబ్ సినిమాగా సరికొత్త చరిత్ర సృష్టించింది..ఈ సినిమా పే రిలీజ్ బిజినెస్ మన రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 79 కోట్ల రూపాయలకు జరగగా ఫుల్ రన్ రన్ లో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ని అందుకోవాలి అంటే మాత్రం కచ్చితంగా వీక్ డేస్ లో బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ హోల్డ్ ని చూపించడం అత్యవసరం..ఇక హిందీ లో మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా వసూళ్ల ప్రభంజనం ఇప్పట్లో ఆగేలా లేదు..మొదటి రోజు 53 కోట్ల రూపాయలకు పైగా నెట్ ని వసూలు చేసిన ఈ చిత్రం..రెండవ రోజు 46 కోట్లు..అలాగే మూడవ రోజు 42 కోట్ల రూపాయిలు, నాల్గవ రోజు అందరి అంచనాలను దాటు 50 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను రాబట్టి బాలీవుడ్ లో చరిత్ర సృష్టించింది..మొత్తానికి నాలుగు రోజులకు గాను ఈ సినిమా 195 కోట్ల రూపాయిల నెట్ ని వసూలు చేసినట్టు బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Also Read: KGF2: ఇంత అద్భుతంగా కేజీఎఫ్2 ఫైనల్ కట్ చేసిన ఎడిటర్ ఈ 19 ఏళ్ల కుర్రాడని తెలుసా?
తమిళనాడు మరియు కేరళ బాక్స్ ఆఫీస్ వద్ద కూడా ఈ సినిమా రోజుకో సరికొత్త రికార్డు సృష్టిస్తూ బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది..ముఖ్యంగా తమిళనాడు స్టార్ హీరో విజయ్ సినిమాకి పోటీ గా దిగి ఈ సినిమా ప్రబంజనం సృష్టించడం అంటే మాటలు కాదు..ఎందుకంటే తమిళనాట విజయ్ కి ఎలాంటి క్రేజ్ ఉందొ మన అందరికి తెలిసిందే..అక్కడ రోజు వారి కలెక్షన్స్ లో విజయ్ బీస్ట్ సినిమాకి మించి వసూలు చెయ్యడం నిజంగా ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం..మొత్తం మీద మూడు రోజులకు గాను ప్రపంచవ్యాప్తంగా 430 కోట్ల రూపాయిల గ్రాస్ మరియు 216 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసిన ఈ చిత్రం, నాలుగు రోజులు పూర్తి అయ్యేసరికి 530 కోట్ల రూపాయిల గ్రాస్ మరియు 270 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసినట్టు సమాచారం..అతి త్వరలోనే ఈ సినిమా వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసి టాప్ 5 లిస్ట్ లోకి చేరబోతున్నట్టు తెలుస్తుంది..మరి ఫుల్ రన్ బాహుబలి 2 (1800 కోట్లు ) గ్రాస్ ని ఈ సినిమా క్రాస్ చేస్తుందో లేదో చూడాలి.
Also Read: KGF2 : బాలీవుడ్ ను షేక్ చేస్తున్న సౌత్ ఇండియా.. కేజీఎఫ్ హిట్ అయితే ఖతమే!
[…] Also Read: KGF 2 4 Days Collections: KGF Chapter2 4 రోజుల వసూళ్లు […]
[…] Also Read: KGF 2 4 Days Collections: KGF Chapter2 4 రోజుల వసూళ్లు […]