Homeఎంటర్టైన్మెంట్తెలుగు తెరను ఏలుతున్న కేరళ భామలు !

తెలుగు తెరను ఏలుతున్న కేరళ భామలు !

తెలుగు చిత్ర సీమలో కేరళ వయ్యారి భామల సంఖ్య రోజురోజుకు ఎక్కువైపోతోంది. కేరళలో అందమైన భామలందరూ తెలుగు సినిమా హీరోయిన్స్ గా మారి పోతున్నట్లు ఉంది పరిస్థితి. సహజంగా కేరళలో అందాల రాసులు ఎక్కువ. పైగా అక్కడి సంప్రదాయ పద్ధతులు అలవాట్లు వాళ్ళ అందాన్ని మరింత పెంచుతుంది. ఆ అందానికి తోడు ఈ భామలు కూడా హొయలు పోతుంటారు.

ఆ హొయలు వీళ్ళ తళుకులు చూసి ఫిదా అయిపోయిన మన మూవీ మేకర్స్.. హీరోయిన్స్ ను ఎక్కువగా అక్కడి నుండే పట్టుకొస్తున్నారు. దాంతో ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న హీరోయిన్స్ లో ఎక్కువమంది కేరళ భామలే. సాయి పల్లవి, కీర్తీ సురేష్, అనుపమ పరమేశ్వరన్, అదితిరావ్ హైదరి, నయనతార, ప్రియమణి, మీరా జాస్మిన్, పూర్ణ, నిత్యా మీనన్ వంటి హీరోయిన్లు తమ అందచందాలతో తెలుగు ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నారు, ఇంకా గెలుచుకుంటూనే ఉన్నారు.

మరి ఈ హీరోయిన్స్ లిస్ట్ లో ప్రస్తుతం ఫామ్ లో ఉన్న వారి గురించి ముచ్చటించుకుందాం. ముందుగా సాయి పల్లవి. చిన్నప్పటి నుండే వేదికల మీద నాట్యం చేస్తూ.. ఈ క్రమంలో తెలుగు టెలివిజన్ కార్యక్రమాల్లో తనదైన డ్యాన్స్ తో కళా హృదయాలను రంజింపజేసేది. టిబిలీసి స్టేట్ మెడికల్ కళాశాల, జార్జియాలో వైద్య విద్యనభ్యసించి.. తెలుగు సినిమాల్లో బలమైన పాత్రల కథానాయికగా గుర్తింపు తెచ్చుకుంది.

అలాగే, కీర్తీ సురేష్ మహానటితో తనకంటూ తెలుగు తెర పై ప్రత్యేకమైన చరిత్రను రాసుకుంది. కీర్తి అక్టోబర్ 17, 1992 లో జన్మించారు. ఫ్యాషన్ డిజైనింగ్ లో డిగ్రీ పూర్తి చేసి.. మలయాళం సినిమాతోనే హీరోయిన్ గా వెండితెరకు పరిచయమైనా.. ఎక్కువగా తమిళ, తెలుగు సినిమాల్లోనే ఆమె గుర్తింపు తెచ్చుకుంది. ఇక భారతదేశ చలన చిత్ర రంగంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన 66వ జాతీయ చలన చిత్ర అవార్డులో భాగంగా మహానటి సినిమాకి గాను కీర్తి సురేష్ ఉత్తమ తెలుగు కథానాయకిగా అవార్డు అందుకుంది.

వీరిందరిలో కల్లా ముఖ్యంగా చెప్పుకోవాల్సిన హీరోయిన్ నయనతార. సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ గా నయనతారకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆమె సినిమా కోసం సౌత్ సినీ జనం ఎదురు చూస్తూ ఉంటారు. పైగా నయనతారకు ఇమేజ్ మరో ఏ హీరోయిన్ కి లేదు. తమిళంలో ఈ కేరళ కుట్టీ జోరు మరీ ఎక్కువ. అందుకే నయన్ తో సినిమాలు చేయడానికి నిర్మాతలు క్యూ కడుతుంటారు. ఇక మాజీ హీరోయిన్స్ లో ప్రియమణి, మీరా జాస్మిన్ వంటి వారు కూడా తెలుగు సినీ లోకంలో ఒక వెలుగు వెలిగారు.

అన్నట్టు కన్నుకొట్టిన కేరళ కుట్టి గుర్తుందిగా. అప్పట్లో ఇంటర్నెట్ సంచలనంగా మారిపోయింది ప్రియా ప్రకాశ్ వారియర్. మొత్తానికి ఈ కేరళ భామ కూడా తెలుగు యువత గుండెల్లో పదిలమైన స్థానం సంపాదించుకుని ప్రస్తుతం తెలుగు సినిమాల్లో తన అందాలతో హల్ చల్ రేపుతుంది. ఈ కేరళ బ్యూటీ ఫ్యాన్స్‌ ఆమె కిస్‌ లకు కిర్రెక్కిపోతున్నారు.

ఇక మరో ముదురు హీరోయిన్ పూర్ణ. టాలీవుడ్ లో పూర్ణకి మంచి పేరు ఉంది. పైగా ఈమె ప్రస్తుతం తెలుగు టెలివిజన్ లో కూడా మంచి ఫామ్ లో ఉంది. అలాగే కొత్తగా తెలుగు తెర పైకి మరో మలయాళీ బ్యూటీ ఐశ్వర్య లక్ష్మీ అడుగుపెడుతోంది. కళ్యాణ్ రామ్ – యాడ్ ఫిల్మ్ మేకర్ జయేంద్ర కాంబినేషన్‌లో రూపొందుతోన్న కొత్త చిత్రంతో ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్, తానూ కూడా టాలీవుడ్‌లో సక్సెస్ అవుతానంటుంది.

ఇక ఇప్పటికే కేరళ భామలు అను ఇమ్మాన్యుయెల్, నివేతా థామస్ లాంటి భామలు కూడా ముంబై ముద్దుగుమ్మలకు మించిన రీతిలో రెచ్చిపోతున్నారు. ఏది ఏమైనా కేరళ కుట్టీలు హీరోయిన్స్ గా తెలుగులో అగ్రపథంలోకి దూసుకెళుతున్నారు. వరుసపెట్టి కేరళ భామలందరూ తెలుగు చిత్ర పరిశ్రమకు ఇంపోర్ట్ అవుతున్నారు. తెలుగు తెరను ఏలుతున్నారు.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular