Homeఎంటర్టైన్మెంట్Keerthy Suresh: ఆ స్టార్ డైరెక్టర్ భార్యతో డ్యాన్స్ చేసిన కీర్తి సురేష్.. వీడియో వైరల్‌

Keerthy Suresh: ఆ స్టార్ డైరెక్టర్ భార్యతో డ్యాన్స్ చేసిన కీర్తి సురేష్.. వీడియో వైరల్‌

Keerthy Suresh: అట్లికుమార్‌.. పరిచయం అక్కరలేని పేరు. పలు సూపర్‌ హిట్‌ సినిమాలకు దర్శకత్వం వహించాడు. తాజాగా ఆయన డైరెక్ట్‌ చేసిన జవాన్‌ సినిమా సూపర్‌డూపర్‌ హిట్‌ అయింది. షారూఖ్‌ ఖాన్‌ హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ రికార్డులు కొల్లగొడుతోంది. ఈ స్టార్‌ డైరెక్టర్‌ భార్య ప్రియఅట్టికుమార్‌తో తెలుగు, తమిళ స్టార్‌ హీరోయిన్‌తో జవాన్‌ సక్సెస్‌ సంబరాలు జరుపుకుంది. ఇంతకీ ఆ హీరోయిన్‌ ఎవరు.. అట్టికి ఆమెతో ఉన్న రిలేషన్‌ ఏంటో తెలుసుకుందాం.

స్టార్‌ హీరోయిన్‌కు మంచి స్నేహితుడు..
డైరెక్టర్‌ అట్లికుమార్‌.. తెలుగు, తమిళంలో స్టార్‌ హీరోయిన్‌ ఇమేజ్‌ సంపాదించుకున్న సహజ నటి కీర్తి సురేష్‌కు మంచి మితుడు. ఇద్దరూ తమిళ ఇండస్ట్రీకి చెందినవారే. తాజాగా తన మిత్రుడు అట్లికుమార్‌ తీసిన జవాన్‌ సినిమా సూపర్‌ హిట్‌ కావడంతో అతని స్నేహితురాలు అయిన కీర్తి సురేష్‌ కూడా సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారు. ఇందులో భాగంగా అట్లి ఇంటికి వెళ్లిన కీర్తి.. ఆయన భార్య ప్రియఅట్లికుమార్‌తో కలిసి జవాన్‌ సినిమాలోని పాటకే స్టెప్పులేశారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌ అవుతోంది.

జవాన్‌ సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తున్న డైరెక్టర్‌..
బాలీవుడ్‌ బాద్షా షారుక్‌ ఖాన్‌తో తెరకెక్కించిన జవాన్‌ వరల్డ్‌ వైడ్‌ గా థియేటర్స్‌ లో పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోతోంది. ముఖ్యంగా నార్త్‌ ఆడియన్స్‌ని ఈ సినిమా విపరీతంగా ఆకట్టుకుంటుంది. అడ్వాన్స్‌ బుకింగ్స్‌ లోనే సరికొత్త రికార్డు క్రియేట్‌ చేసిన ఈ మూవీలో షారుక్‌ని వివిధ గెటప్స్‌ లో చూపించి అభిమానుల ప్రశంసలు అందుకుంటున్నారు అట్లీ. ఓ సౌత్‌ డైరెక్టర్‌ షారుక్‌ ఖాన్‌ లాంటి బడా స్టార్‌ తో సినిమా తీసి ప్రశంసలు అందుకోవడం అంటే అది మామూలు విషయం కాదు. అందుకే ఈ సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌ అట్లీ ఫుల్లుగా ఎంజాయ్‌ చేస్తున్నాడు. 1986 సెప్టెంబర్‌ 21న తమిళనాడులో ఓ గ్రామంలో జన్మించిన అట్లీ అసలు పేరు అరుణ్‌ కుమార్‌. సంచల దర్శకుడు శంకర్‌ దగ్గర ‘రోబో’, ‘స్నేహితుడు’ సినిమాలకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌ గా పని చేశాడు.

దర్శకుడు అట్లీ భార్యకు తారకరత్నతో రిలేషన్‌..
అట్లీ భార్య ప్రియ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిది ప్రేమ వివాహం. ప్రియ కూడా పలు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన విషయం ఏమిటంటే.. ప్రియకు నందమూరి తారకరత్న మధ్య మంచి అనుబంధం ఉందట. గతంలో తారకరత్న హీరోగా నటించిన ‘యువరత్న’ సినిమాలో తారకరత్నకు చెల్లెలుగా నటించింది ప్రియ. ఆ సినిమా ఫ్లాప్‌ అయినప్పటికీ ప్రియ పాత్రకు మంచి గుర్తింపు దక్కింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular