Keerthi Suresh in Politics: ఎలాంటి పాత్ర అయిన అలవోకగా చేయగల అతి తక్కువమంది హీరోయిన్లలో ఒకరు కీర్తి సురేష్(Keerthi Suresh). మలయాళం లో బాలనటిగా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన కీర్తి సురేష్. పెద్దయ్యాక మొదటి సినిమా నుండే హీరోయిన్ గా తన మార్క్ ని వేసుకునే ప్రయత్నం చేసింది. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ, నటిగా ఆమె శిఖరాగ్ర స్థాయికి వెళ్లి కూర్చుంది. ఇప్పుడు ఆమెకు వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ వస్తున్నా కూడా వరుసగా సినిమాలు చేయగలుగుతుంది అంటే ఆమెకు ఉన్న బ్రాండ్ ఇమేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఆమె కెరీర్ ని మహానటి ముందు, ఆ తర్వాత అని విభజించవచ్చు. మహానటి సావిత్రి పాత్రలో అద్భుతంగా జీవించి ఉత్తమ నటి క్యాటగిరీ లో నేషనల్ అవార్డుని అందుకుంది. అప్పటి నుండి కీర్తి సురేష్ వరుసగా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు మాత్రమే చేస్తూ వచ్చింది.
రీసెంట్ గానే ఆమె సుహాస్ తో కలిసి ‘ఉప్పుకప్పురంబు’ అనే అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్ మూవీ లో నటించింది. ఈ సినిమాకు ఓటీటీ ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ సంగతి కాసేపు పక్కన పెడితే, కీర్తి సురేష్ గురించి సోషల్ మీడియా లో లేటెస్ట్ గా ప్రచారం అవుతున్న ఒక వార్త పెద్ద సంచలనం రేపుంటుంది. వివరాల్లోకి వెళ్తే రీసెంట్ గానే కీర్తి సురేష్ మదురై లోని ఒక ఈవెంట్ కి ముఖ్య అతిథి గా పాల్గొన్నది. ఈ ఈవెంట్ కి హాజరైన అభిమానులు కీర్తి కనిపించిన వెంటనే TVK అని అరవడం మొదలు పెట్టారు. TVK అంటే తమిళ హీరో విజయ్(Thalapathy Vijay) స్థాపించిన రాజకీయ పార్టీ పేరు. ఇలా ఒక్కసారిగా ఆమెని చూడగానే అందరూ ఈ పార్టీ పేరు ఎత్తడం తో, వచ్చే ఏడాది తమిళనాడు లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్థిగా మధురై స్థానం నుండి కీర్తి సురేష్ పోటీ చేస్తుందేమో అని సోషల్ మీడియా లో విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు.
అయితే అక్కడికి వచ్చిన వారు TVK అని అరవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. కీర్తి సురేష్ కి తమిళ హీరో విజయ్ అంటే వీరాభిమానం. ఈ విషయాన్ని స్వయంగా ఆమె ఎన్నో ఇంటర్వ్యూస్ చెప్పుకొచ్చింది. వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఇప్పటి వరకు రెండు సినిమాలు వచ్చాయి. ఆ సమయం లోనే వీళ్లిద్దరి మధ్య ప్రేమ పుట్టిందని, వీళ్లిద్దరు డేటింగ్ చేసుకుంటున్నారంటూ సోషల్ మీడియా లో ఎన్నో ప్రచారాలు జరిగాయి. అయితే అది కేవలం రూమర్ మాత్రమే అని కీర్తి సురేష్ పెళ్లి చేసుకోవడం తో రుజువు అయ్యింది. రీసెంట్ గా DMK పార్టీ కి సంబంధించిన మంత్రి TVK అంటే ‘త్రిష విజయ్ కీర్తి’ అని సెటైర్లు విసిరాడు. మొన్న కీర్తి సురేష్ కనపడగానే TVK అని అరవడం ని చూస్తుంటే కీర్తి సురేష్ ని వెక్కిరించే ప్రయత్నం అభిమానులు చేసినట్టుగా మరికొంతమంది చెప్తున్నారు.