Keerthi Bhat: బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్ కీర్తి భట్ సోషల్ మీడియా వేదికగా తన ఆవేదన వెళ్లగక్కారు. అమర్ దీప్ ఫ్యాన్స్ అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని వెల్లడించారు. అదే సమయంలో మాస్ వార్నింగ్ ఇచ్చారు. కీర్తి భట్ వీడియోలు వైరల్ అవుతున్నాయి. విషయంలోకి వెళితే… సీరియల్ హీరోయిన్ కీర్తి భట్ బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణకు సపోర్ట్ చేశారు. అతనికి మద్దతుగా కొన్ని పోస్ట్స్ పెట్టారు. సెలబ్రిటీ వీకెండ్ లో గౌతమ్ కృష్ణకు సపోర్ట్ చేస్తూ ఆమె వేదిక మీదకు వెళ్లారు.
ఒక సీరియల్ నటిగా ఆమె సీరియల్ యాక్టర్స్ ని సపోర్ట్ చేయాలని అమర్ దీప్ ఫ్యాన్స్ ఆమె మీద అక్కసు పెంచుకున్నారు. అమర్ దీప్ ని కాదని గౌతమ్ కృష్ణకు ఎలా సపోర్ట్ చేస్తావని ఆమె మీద సోషల్ మీడియా దాడికి దిగారు. బూతు కామెంట్స్ పెడుతూ ఇబ్బంది పెడుతున్నారు. ఈ క్రమంలో కీర్తి భట్ ఇంస్టాగ్రామ్ లో వరుస వీడియోలు పోస్ట్ చేసింది.
నేను ఎవరికి సపోర్ట్ చేయాలనేది నా పర్సనల్. మీరు ఎవరు నాకు చెప్పడానికి. గౌతమ్ ఎవరి సప్పోర్ట్ లేకుండా సింగిల్ గా ఆడాడు. అందుకే గౌతమ్ కి సపోర్ట్ చేశాను. గౌతమ్ ని చూస్తే నన్ను నేను చూసుకునట్లు ఉండేది. నేను డబ్బులు తీసుకుని సపోర్ట్ చేయలేదు. నా సంపాదన నాకుంది. బూతు కామెంట్స్ పెడుతున్నారు. మీ ఇంట్లో ఆడవాళ్లు లేరా? మీరు అమ్మ కడుపులో నుండేగా పుట్టారు. మహిళలను గౌరవించండి.
నాది తప్పు ఉంటే మీ కాళ్ళకు దండం పెడతా. అసభ్య కామెంట్స్ పెట్టిన వాళ్ళ ఐడీలు ట్రాక్ చేస్తా. మీ ఇంటికి వచ్చి నడి రోడ్డు మీద కొడతా. మీ అమ్మతో కొట్టిస్తా… అంటూ కీర్తి భట్ మాస్ వార్నింగ్ ఇచ్చింది. బిగ్ బాస్ సీజన్ 6లో పాల్గొన్న కీర్తి భట్ ఫైనల్ కి వెళ్ళింది. రేవంత్, శ్రీహాన్ తర్వాత ఆమె మూడో స్థానం దక్కించుకుంది. కీర్తి చేతి వేలికి ఫ్రాక్చర్ అయ్యింది. గాయంతో కూడా గేమ్స్ లో గట్టిగా రాణించింది.