హీరోయిన్ కత్రినా కైఫ్ ( Katrina Kaif) గురించి ప్రస్తుతం ఒక టాపిక్ తెగ హల్ చల్ చేస్తోంది. ఆమె తన పెళ్లి పై నిర్ణయం తీసుకుందని, 40లోకి అడుగు పెట్టక ముందే పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయిపోవాలని, ఈ క్రమంలో ఆమె ఎంగేజ్ మెంట్ కూడా జరిగిపోయిందని సోషల్ మిడియాలో ఓ వార్త బాగా వైరల్ అవుతుంది.
ఇంతకీ నిశ్చితార్థం ఎవరితో అంటే.. హీరో విక్కీ కౌశల్ తో. పైగా విక్కీ కౌశల్ (Vicky Kaushal) – కత్రినా నిశ్చితార్థం ఫోటోలు ఇవే అంటూ కొన్ని పిక్స్ కూడా బాగా హడావుడి చేశాయి. దాంతో, ఇక చేసేది ఏమి లేక కత్రినా టీం రంగంలోకి దిగి.. అవి ఫేక్ మహాప్రభో అంటూ క్లారిటీ ఇచ్చారు. నిజానికి చాలాకాలంగా కత్రినా, విక్కీ కౌశల్ డేటింగ్ చేస్తున్న మాట వాస్తవం.
స్టార్ హీరో రణబీర్ కపూర్, కత్రినాకి హ్యాండిచ్చి ఆమెను వదిలేసిన తర్వాత, ఒంటరితనంతో కత్రినా చాలా నలిగిపోయింది. ఈ క్రమంలోనే విక్కీ కౌశల్ తో డేటింగ్ స్టార్ట్ చేసింది. ఈ క్రమంలోనే విక్కీ కౌశల్ – కత్రినా ఎంగేజ్ మెంట్ జరిగిందని వార్తలు, ఫోటోలు వైరల్ అయ్యాయి. అవ్వన్నీ ఫేక్ అని, ఇంకా ఎలాంటి నిశ్చితార్థం జరగలేదని కత్రినా టీం చెప్పుకొచ్చింది.
ఇక విక్కీ కౌశల్ కి 33 ఏళ్ళు. అదే కత్రినాకి 38 ఏళ్ళు. అంటే ఆమె కంటే 5 ఏళ్ళు చిన్నవాడు. అయినా ప్రేమకు వయసుతో సంబంధం ఏముంది లేండి. ప్రస్తుతానికి అయితే, కత్రినా, విక్కీ కౌశల్ ప్రేమలో మునిగి తేలుతూ సంతోషంగా లైఫ్ ను లీడ్ చేస్తోంది.
అయితే, కత్రినా ఇప్పటికీ సల్మాన్ ఖాన్ తో సన్నిహితంగానే ఉంటుందని బాలీవుడ్ లో ఒక టాక్ ఉంది. అందుకే సల్మాన్ ఖాన్ ఇంటికి కత్రినా అప్పుడప్పుడు వెళ్లి వస్తోంది. కాబట్టి కత్రిన పెళ్లికి సల్మాన్ ఖాన్ అంగీకారం కూడా కావాలట.