https://oktelugu.com/

Katrina Kaif: పెళ్లి వేడుకకు హాజరైన అతిధులకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన విక్ట్రీనా జంట…

Katrina Kaif: బాలీవుడ్ ప్రేమ జంట కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ ఇటీవల పెళ్లితో ఒక్కటయ్యారు. వీరి పెళ్లికి బాలీవుడ్ దిగ్గజాలంతా తరలివచ్చారు. రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్‌లోని గల లగ్జరీ హోటల్‌ సిక్స్‌ సెన్సెస్‌ ఫోర్ట్ బార్వారాలో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. అయితే తమ పెళ్లి వీడియోలు, ఫొటోలు బయటకు లీక్ కాకుండా జాగ్రత్తపడ్డారు ఈ జంట. పెళ్లిని రికార్డు చేసే బాధ్యతను ఓ సంస్థకు అప్పగించినట్లు తెలిసింది. అయితే, ఆ పెళ్లికి హాజరైన కొందరు […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 11, 2021 / 06:14 PM IST
    Follow us on

    Katrina Kaif: బాలీవుడ్ ప్రేమ జంట కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ ఇటీవల పెళ్లితో ఒక్కటయ్యారు. వీరి పెళ్లికి బాలీవుడ్ దిగ్గజాలంతా తరలివచ్చారు. రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్‌లోని గల లగ్జరీ హోటల్‌ సిక్స్‌ సెన్సెస్‌ ఫోర్ట్ బార్వారాలో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. అయితే తమ పెళ్లి వీడియోలు, ఫొటోలు బయటకు లీక్ కాకుండా జాగ్రత్తపడ్డారు ఈ జంట. పెళ్లిని రికార్డు చేసే బాధ్యతను ఓ సంస్థకు అప్పగించినట్లు తెలిసింది. అయితే, ఆ పెళ్లికి హాజరైన కొందరు అక్కడి చిత్రాలను తీసి సోషల్ మీడియాలో లీక్ చేయడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో కత్రినా కైఫ్, విక్కీ కౌశల్‌లే స్వయంగా తమ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

    హిందూ సాంప్రదాయ పద్దతిలో జరుగుతున్న ఈ పెళ్లిలో కత్రినా బుట్టబొమ్మలా మెరిసిపోతుంది. పెళ్లి సందర్భంగా బుధవారమే హల్దీ వేడుక, సంగీత్ నిర్వహించారు. కత్రినా రెడ్ కలర్ సబ్యసాచి లెహెంగాలో పెళ్లికూతురిగా ముస్తాబు కాగా… ఆమెకు తగ్గట్టే విక్కీ కూడా క్రీమ్ కలర్ షేర్వాణీ, తలకు పాగాతో రాయల్ గా కనిపించాడు. ఇక ఈ జంటను ఆలా చూసిన అభిమానులు మురిసిపోతున్నారు. పెళ్లయ్యాక కొత్త జంట రిసెప్షన్‌ను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు కత్రినా, విక్కీల కుటుంబ సభ్యులతోపాటు వారి స్నేహితులు, బాలీవుడ్ సెలబ్రిటీలు తరలివచ్చారు. వివాహ జీవితంలోకి అడుగుపెట్టిన బాలీవుడ్ నటులు కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ తమ పెళ్లికి వచ్చిన అతిథుల కోసం ప్రత్యేక బహుమతిని అందించారు. ఈ మేరకు వివాహానికి విచ్చేసిన అతిధులు గ్రాండ్ వెడ్డింగ్ తర్వాత ఇళ్లకు తిరిగి వెళ్తున్నారు. అయితే, ఈ జంట వచ్చిన అతిధులు వట్టి చేతులతో వెళ్లకూడదని ఓ మంచి బహుమతి ఇచ్చి పంపించారు. ప్రియమైన తమ అతిథులకోసం స్వీట్ బాక్స్‌తో పాటు ఓ ‘స్వీట్ నోట్’ కూడా ఇచ్చి పంపించారు.