Karuppu Movie 6 Days Collections: తమిళ హీరో సూర్య నటించిన లేటెస్ట్ చిత్రం ‘కరుప్పు’. ఎలాంటి అంచనాలు లేకుండా చాలా సాధారణంగా విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టిస్తున్న వసూళ్ల సునామీ ని చూసి ట్రేడ్ పండితులు సైతం విస్మయానికి గురయ్యారు. సూర్య కం బ్యాక్ ఇస్తే ఎలా ఉంటుందో మరోసారి అందరికీ అర్థం అయ్యేలా చేసింది ఈ చిత్రం. 14 ఏళ్ళ నుండి కెరీర్ లో సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతూ , ఇక సూర్య కెరీర్ ముగిసిపోయింది అని అందరూ అనుకుంటున్న సమయం లో ఈ చిత్రం ఇచ్చిన విజయం , ఆయన అభిమానుల్ని గర్వంగా కాలర్ ఎగరేసుకునేలా చేసింది. వీకెండ్స్ లో సూపర్ హిట్ సినిమాలకు రన్ రావడం సర్వసాధారణం. కానీ ఈ చిత్రం వర్కింగ్ డేస్ లో కూడా ఇరగకుమ్మేస్తుంది. నిన్న కూడా ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 15 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
ప్రాంతాల వారీగా వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే , ముందుగా తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి 6 రోజుల్లో 20 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అందులో నైజాం ప్రాంతం నుండి 9 కోట్ల రూపాయిల గ్రోస్ వసూళ్లు రాగా, ఆంధ్రా + సీడెడ్ ప్రాంతం నుండి 11 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. షేర్ వసూళ్లు దాదాపుగా 10 కోట్ల రూపాయిల వరకు వచ్చింది . అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ ఈ సినిమాకు సంబంధించిన తెలుగు వెర్షన్ థియేట్రికల్ రైట్స్ ని 7 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయగా, వాళ్లకు 3 కోట్ల రూపాయిల లాభాలు వచ్చినట్టు తెలుస్తోంది. ఇక మిగిలిన ప్రాంతాల విషయానికి వస్తే తమిళనాడు నుండి 80 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, కర్ణాటక రాష్ట్రం నుండి 14 కోట్ల రూపాయిలు వచ్చాయి.
అదే విధంగా కేరళ రాష్ట్రము నుండి 10 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, హిందీ + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 2 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా ఓవర్సీస్ నుండి ఈ చిత్రానికి 54 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా , ఓవరాల్ గా ఈ చిత్రానికి 178 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు , 86 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. 70 కోట్ల రూపాయలకు ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరగ్గా, బయ్యర్స్ కి 16 కోట్ల రూపాయలకు పైగా లాభాలు వచ్చాయి. ఈ వీకెండ్ తో ఈ చిత్రం తమిళనాడు నుండి 100 కోట్ల గ్రాస్ వసూళ్లు మార్కుని అందుకోనుంది, అదే విధంగా ఓవర్సీస్ లో ప్రతిష్టాత్మక 60 కోట్ల గ్రాస్ మార్కుని కూడా ఈ వీకెండ్ తోనే అందుకోనుంది ఈ చిత్రం.
