Homeఎంటర్టైన్మెంట్Raja Vikramarka Movie: వైభవంగా కార్తికేయ "రాజ విక్రమార్క" ప్రీ రిలీజ్ ఈవెంట్...

Raja Vikramarka Movie: వైభవంగా కార్తికేయ “రాజ విక్రమార్క” ప్రీ రిలీజ్ ఈవెంట్…

Raja Vikramarka Movie: ఆర్ఎక్స్ 100 చిత్రంతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు కార్తికేయ. ఈ చిత్రం తర్వాత విభిన్న కథలతో ప్రేక్షకులను అలరించేందుకు కార్తికేయ ప్రయత్నించిన… అవి అంత సక్సెస్ కాలేదనే చెప్పాలి. హిట్లు ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు ఈ యంగ్ హీరో. అయితే ప్రస్తుతం కార్తికేయ నటిస్తున్న చిత్రం ‘రాజా విక్రమార్క’. ఈ చిత్రాన్ని  టి.ఆదిరెడ్డి సమర్పణలో శ్రీచిత్ర మూవీ మేకర్స్ బ్యానర్ పై 88 రామారెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీ సరిపల్లి దర్శకత్వం వహిస్తుండగా…  తాన్యా రవిచంద్రన్  హీరోయిన్ నటిస్తుంది. హీరోగానే కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్ర అయితే విలన్‌ గానూ చేస్తూ ఆకట్టుకుంటున్నాడు కార్తికేయ.

karthikeya raja vikramarka movie pre release event on live

ఈ నెల 12న సినిమా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్, ఆకట్టుకున్నాయి.  దీపావళి కానుకగా ఈ సినిమా ట్రైలర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ క్రమంలో రాజా విక్రమార్క ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరుగుతుంది. ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. అలానే ఈ సినిమాలో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫేమ్ సుధాకర్, తనికెళ్ళ భరణి, హర్షవర్ధన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందిస్తున్న ఈ సినిమాను నవంబర్ 12 న విడుదల చేస్తున్నారు. ఎన్ఐఏ ఏజెంట్ గా కార్తికేయ లుక్, బాడీ కట్ అవుట్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ కానున్నాయి. ఈ వేడుక లైవ్ మీకోసం…

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular