Karthika Deepam: బుల్లితెరపై ఎంతో రసవత్తరంగా కొనసాగుతున్న కార్తీకదీపం సీరియల్ ఎన్నో ట్విస్టుల మధ్య రోజు రోజుకి ఎంతో ఉత్కంఠ భరితంగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే నేటి ఎపిసోడ్ లో భాగంగా.. గత కొద్దిరోజుల నుంచి మోనిత కార్తీక్ కుటుంబంతో ఇష్టానుసారంగా ఆడుకుంది. ఇక ఆ బాధ నుంచి కార్తీక్ కుటుంబం బయటపడింది. ఇక ఆ మోనిత పీడ కార్తీక్ కుటుంబానికి ఉండదని తెలిసి అందరూ ఎంతో సంతోషంగా గడుపుతారు. ఈ క్రమంలోనే అందరూ కలిసి పొడుపు కథలు ఆడుతూ ఉండగా అందుకు కార్తీక్ ఆదిత్య సమాధానం చెప్పలేకపోతున్నారు. ఆ సమయంలో ఆనందరావు తన కొడుకు టీం ఓడిపోతుందని భావిస్తారు.

ఇక సౌందర్య తన కుటుంబం మొత్తం సంతోషంగా ఉండడం చూసి ఎంతో సంబరపడుతోంది ఇదే సమయంలోనే సౌందర్య స్వీట్స్ తెచ్చి దీపకు తినిపిస్తూ అసలైన దీపావళి పండుగ ఈ రోజే అంటూ అందరికీ స్వీట్స్ తినిపిస్తుంది. ఇలా కార్తీక్ కుటుంబం మొత్తం సంతోషంలో ఉండగా మోనిత మాత్రం కోపంతో రగిలిపోతూ కార్తీక్ కుటుంబాన్ని నాశనం చేయడానికి మరొక పథకం వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలోనే లాయర్ ను పిలిపించి ఏదో ప్లాన్ చెబుతూ ఆ వంటలక్క పై తానే గెలవాలని భావిస్తుంది.
Also Read: ఇది సినిమా టీజర్ కాదు, ఎమోషనల్ జర్నీ !
ఇక లాయర్ కూడా తనకు ఏదో ప్లాన్ చెబితే ఎంత రిస్క్ అయినా పర్లేదు ఈ ప్లాన్ ఫర్ఫెక్ట్ గా చేయాలి అంటూ చెబుతుంది. ఇక దీప కార్తీక్ గదికి వెళ్లగా కార్తీక్ తనకు శ్రీశ్రీ మహాప్రస్థానం పుస్తకాన్ని బహుమతిగా ఇవ్వడంతో దీప ఎంతో సంతోష పడుతుంది. అందులో ఉన్న కొన్ని మంచి మాటలను దీపా వివరించగా కార్తీక్ ఆమెను పొగుడుతాడు. ఇక ఆలోగా దీపకు తన బస్తి ప్రజలు గుర్తుకురావడంతో వారి సమస్యల గురించి కార్తీక్ కి వివరించగా వెంటనే క్యాంపు పెడదామని కార్తీక్ చెబుతాడు. కార్తీక్ మాటలకు దీపం ఎంతో సంతోషపడ్డారు ఇక తన జీవితంలో మోనిత అనే పేరు వినిపించదని తెలిసి ఎంతో సంతోషపడిన కార్తీక్ దీపను బంగారం అంటూ ఎంతో ప్రేమగా పిలుస్తారు.
ఇక మోనిత లాయర్ తో ఫోన్లో మాట్లాడుతూ ఉండగా అక్కడే ఉండి ప్రియమణి వింటుంది.ఇక ఫోన్లో మాట్లాడిన అనంతరం మోనిత ప్రియమణిని పిలిచి మనం కార్తీక్ ఇంటికి వెళ్ళాలి తొందరగా తయారవ్వు అని చెప్పడంతో ప్రియమణి షాక్ అవుతుంది. అయితే కార్తీక్ బస్తీలో క్యాంపు పెట్టారని తెలియడంతో అక్కడికి వెళుతుంది. అప్పటికే అక్కడున్న వారికి చికిత్స చేస్తున్న కార్తీక్ తో ఓ మహిళ తన భర్త గురించి చెబుతూ బాధపడుతుండగా అదే సమయంలో మోనిత ఎంట్రీ ఇచ్చి నా పరిస్థితి కూడా అదే అంటూ అనడంతో అక్కడున్న వారు షాక్ అవుతారు. దీన్ని బట్టి చూస్తే మోనిత ఏదో గట్టిగానే ప్లాన్ చేసిందని తెలుస్తోంది.
Also Read: ప్చ్ చిరంజీవి.. వాళ్లకు వీళ్ళకు ఎవరికీ నచ్చడం లేదు !