Karthika Deepam: రుద్రాణి మనుషులను కొట్టిన డాక్టర్ బాబు.. ఎక్కడికి వెళ్ళినా కార్తీక్ ను వదలని మోనిత!

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో దీప కార్తీక్ తో ఎందుకు సహాయం చేయడానికి ముందుకు రాలేదు అని అడుగుతూ బాధపడుతుంది. కార్తీక్ మాట్లాడుతూ.. తాను ఈ ఉద్యోగానికి పనికిరాను అన్నట్లు ఈ ఉద్యోగం నుంచి తనను తొలగించారని అంటాడు. కానీ మానవత్వం ఏమైంది అని దీప అడుగుతుంది. వాళ్ళ ఇంట్లో మనం ఉంటున్నాము అంటూ బాధపడుతుంది. కార్తీక్ ఆ మాటలు విని లోలోపల కుమిలిపోతుంటాడు. […]

Written By: Navya, Updated On : December 13, 2021 2:17 pm
Follow us on

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో దీప కార్తీక్ తో ఎందుకు సహాయం చేయడానికి ముందుకు రాలేదు అని అడుగుతూ బాధపడుతుంది. కార్తీక్ మాట్లాడుతూ.. తాను ఈ ఉద్యోగానికి పనికిరాను అన్నట్లు ఈ ఉద్యోగం నుంచి తనను తొలగించారని అంటాడు. కానీ మానవత్వం ఏమైంది అని దీప అడుగుతుంది. వాళ్ళ ఇంట్లో మనం ఉంటున్నాము అంటూ బాధపడుతుంది.

కార్తీక్ ఆ మాటలు విని లోలోపల కుమిలిపోతుంటాడు. ఇక దీప ఇంట్లోకి వెళ్దాం అనేసరికి కార్తీక్ ఇప్పుడే వస్తాను అని అక్కడి నుంచి వెళ్తాడు. కార్తీక్ వెళ్లి అక్కడ బయట ఉన్న వారి సామాన్లను సర్ది ఇంట్లో పెట్టాలి అని అనుకుంటాడు. అప్పుడే రుద్రాణి మనుషులు వచ్చి కార్తీక్ పై అరుస్తారు. వెంటనే కార్తీక్
ఓపిక తట్టుకోలేక వారిని కొట్టి అక్కడనుంచి వెళ్ళి పోతాడు.

మోనిత కార్తీక్ ఎక్కడికి వెళ్ళాడు అని ఆలోచిస్తుంది. కార్తీక్ ఫోన్ కి కాల్ చేయడంతో మహేష్ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతాడు. డబ్బులు ఇస్తే చెబుతాను అనేసరికి మోనిత అతనికి డబ్బులు ఇచ్చి ఏం జరిగిందో తెలుసుకుంటుంది. ఇదంతా వాళ్లు ప్లాన్ చేశారా లేదా తప్పించుకున్నారా అని అనుకుంటుంది. ఎలాగైనా వాళ్ల అంతు చూస్తాను అని ఎక్కడున్నా కార్తీక్ ను పట్టుకుంటాను అన్నట్లు మాట్లాడుతుంది.

మరోవైపు సౌందర్య కార్తీక్, దీపల కోసం దేవుడికి దండం పెట్టుకుంటూ ఏడుస్తుంది. ఎలాగైనా వాళ్ళని ఇంటికి రప్పించాలని కోరుకుంటుంది. అప్పుడే ఆనందరావు వచ్చి తనను ఓదారుస్తు తాను కూడా బాధపడతాడు. కార్తీక్ పిల్లలను చూసుకుంటూ ఆలోచిస్తుంటాడు. తనను హాస్పిటల్ నుండి డాక్టర్ గా తొలగించిన విషయాలు తలుచుకుంటాడు. తరువాయి భాగంలో పిల్లలకు తాను డాక్టర్ కాదని వేరే ఉద్యోగంలో పని చేస్తున్నాను అని పిల్లలకు చెప్పటంతో పిల్లలు బాగా ఎమోషనల్ అవుతారు. మరోవైపు దీప కూడా వంటలక్కగా గరిట పట్టుకొనుంది.