Karthika Deepam: స్టార్ మా లో ప్రసారం అవుతూ విశేషమైన ప్రేక్షకాదరణ దక్కించుకుని రోజురోజుకు అత్యధిక రేటింగ్స్ తో దూసుకుపోతున్న కార్తీకదీపం సీరియల్ నేడు మరింత ఉత్కంఠభరితంగా కొనసాగనుంది. ఈ క్రమంలోనే నేటి ఎపిసోడ్ లో భాగంగా మోనిత తన కొడుకు బారసాల అంటూ కార్తీక్ కుటుంబాన్ని ఆహ్వానిస్తుంది. అందుకు కార్తీక్ కోపడటంతో దీప తన కుటుంబం మొత్తాన్ని బారసాలకి తీసుకు వస్తానని హామీ ఇస్తుంది. దీప మాటకు అందరూ షాక్ అవుతారు. ఇకపోతే దీప పుట్టినరోజు కావడంతో గుడికి వెళ్లాలని బయలుదేరుతారు. అదే సమయంలో మోనిత రావడంతో దీప అత్తయ్య ఇక మీరు గుడికి రారు నేను పిల్లలు వెళ్తాము అంటూ బయలు దేరుతారు.
ఇక మోనిత తన ఇంటికి బయలుదేరుతూ దీప అన్న మాటలను గుర్తు చేసుకొని భయపడుతుంది. నిజం తెలిసిన తర్వాత దీప అస్తమించిన సూర్యుడు మాదిరి కృంగి పోతుంది అనుకుంటే నాకే ఇలాంటి షాక్ ఇచ్చింది అంటూ కంగారు పడుతుంది. అయినా నా వైపు ఆనందరావు ఉన్నారు. నేను విజయం ముంగిట్లో ఉన్నాను నాకేమీ కాదు అంటూ తనకు తానే సర్దిచెప్పుకొని ఇంటికి వెళ్తుంది.
ఇక గుడికి వెళ్ళిన దీప పిల్లలతో కలిసి ఎంతో సరదాగా మాట్లాడుతుంది.ఈ టైంలో డాడీ వచ్చి ఉంటే ఎంతో బాగుండేది అమ్మా అంటూ పిల్లలు అనగా మీ డాడీకి వేరే పనులు ఉన్నాయి చాలా బిజీగా ఉన్నారు అంటూ మాట్లాడుతుంది. ఇక గుడి నుంచి పిల్లలను రెస్టారెంట్ కి తీసుకువెళ్లి వారికి ఏది నచ్చితే అది ఆర్డర్ చేసి తినమని చెబుతుంది దాంతో పిల్లలు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక ఇంటికి పిల్లలు మాత్రమే తిరిగి వస్తారు.దీంతో కంగారుపడిన కార్తీక్ కుటుంబం అమ్మ ఏది అని అడగడంతో అమ్మ వెళ్ళిపోయింది కదా అని సమాధానం చెప్పగా అందరూ ఒక్కసారిగా ఏంటి అని ప్రశ్నిస్తారు.అమ్మ అమ్మమ్మ తాతయ్య దగ్గరికి వెళ్ళింది రేపు మీరు అందరూ ఎక్కడికో వెళ్తారంట కదా అక్కడికి వస్తానని చెప్పిందని సమాధానం చెప్పి పిల్లలపై కి వెళ్తారు. పిల్లల మాటలు విన్న సౌందర్య భయపడి దీపకి ఫోన్ చేయమని చెబుతుంది. అప్పటికే దీప ఫోన్ స్విచాఫ్ రావడంతో కార్తీక్ కంగారు పడ్డాడు. అయితే చివరికి దీప ఎలాంటి ట్విస్ట్ ఇవ్వబోతోందో తెలియాల్సి ఉంది.