
ప్రయోగాలంటేనే గిట్టని మహేష్ బాబు తాజాగా ఎప్పుడూ మూసధోరణితోనే సినిమాలు చేస్తాడనే పేరుంది. అప్పుడప్పుడూ లుక్ లో కాస్త చేంజేస్ చేస్తాడు. అంతేతప్ప పిరియాడికల్, డ్రామా, హర్రర్, వినూత్న ప్రయోగాలు చేయడం లేదు. అప్పట్లో కౌబాయ్ లా మారి తీసిన ‘టక్కరి దొంగ’ ఫ్లాప్ కావడంతో ఇక మహేష్ అటువైపు చూడడం లేదు.
అదలా ఉంచితే.. మహేష్ బాబు తెలుగుతో పాటు తమిళంలో కూడా బాగా మాట్లాడగలరు. గత స్పైడర్ చిత్రాన్ని తమిళంలో రిలీజ్ చేసినప్పుడు సొంతంగా తన పాత్రకు తమిళంలో డబ్బింగ్ కూడా చెప్పారు. నిజానికి మహేష్ బాబుకు తెలుగుతో పాటు తమిళం కూడా బాగా వచ్చు. ఎందుకంటే ఆయన పుట్టింది పెరిగింది అంతా తమిళనాడు రాజధాని చెన్నైలోనే.. ఆయన అక్కడే చదువుకున్నాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్ కు రాకముందు చెన్నైలోనే ఉండేది. హీరో కృష్ణ అక్కడే నివాసముండి సినిమాలు తీసేవాడు. కృష్ణతో పాటు ఆయన భార్య, పిల్లలు ఉండడంతో మహేష్ బాల్యమంతా చైన్నైలోనే సాగింది.
మహేష్ బాబు ఆగస్టు 9, 1974న సూపర్ స్టార్ కృష్ణ, శ్రీమతి ఇందిరాదేవి దంపతులకు మద్రాసులో జన్మించారు. మద్రాసులోనే మహేష్ చదువు పూర్తయ్యింది. పదోతరగతి వరకు చెన్నైలోని సెయింట్ బెడె స్కూల్ లో చదివారు. అక్కడ లయోలా కాలేజీలో కామర్స్ లో ఇంటర్ , డిగ్రీ పూర్తిచేశారు.
చిన్నతనంలోనే నటనలో ఓనమాలు దిద్దిన మహేష్ బాబు 5 ఏళ్ల వయసులోనే 1979తో రిలీజ్ అయిన ‘నీడ’ సినిమాతో తెలుగులో తెరంగ్రేట్రం చేశాడు. బాల్యనటుడిగా 7 చిత్రాలు చేశాడు. 1991లో బాలనటుడిగా వచ్చిన బాలచంద్రుడు మూవీ గ్రాండ్ హిట్ అయ్యింది. అప్పుడు డ్యాన్సులు, నటనలతో అలరించాడు. కానీ ఆ సమయంలో స్కూలు విద్య చదువుతున్న మహేష్ బాబు చదువులు డిస్ట్ర్రబ్ కావడంతో కృష్ణ గారు సినిమాలకు బ్రేక్ వేసి చదువులు పూర్తి చేయాలని పంపించేశారు. దీంతో ఆ తర్వాత మహేష్ బాబు సినిమాల్లో నటించలేదు.
ఆ తర్వాత చాలా ఏళ్లకు 1999లో ప్రిన్స్ మహేష్ బాబు రాజకుమారుడు మూవీతో తెలుగులో హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా వెలుగొందుతున్నాడు.
మహేష్ విద్యాభ్యాసం అంతా చెన్నైలోనే సాగడంతో ఆయన ఫ్రెండ్స్ అంతా అక్కడే ఉన్నారు. కార్తి, సూర్య లు కూడా మహేష్ బాబు క్లాస్ మేట్స్ అంట.. వారు మహేష్ ఒకటే స్కూళ్లో చదివారు. హైదరాబాద్ వచ్చేశాక మహేష్ కు స్నేహితులు తగ్గిపోయారు. అందుకే ఎప్పుడూ చెన్నై వెళ్లిన తన చిన్ననాటి స్నేహితులను కలుసుకొని వారితో సరదాగా గడుపుతాడట.. అలా డిగ్రీ కామర్స్ చదివిన మహేష్ తండ్రి బాటలో నటుడిగా మారి ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీని ఏలుతున్నాడు.