Kareena Kapoor: నెపో కిడ్ అయినప్పటికీ టాలెంట్ తో స్టార్ హీరోయిన్ అయ్యింది కరీనా కపూర్. ఒక దశలో నెంబర్ వన్ హీరోయిన్ గా బాలీవుడ్ ని షేక్ చేసింది. కరీనా అక్క కరిష్మా సైతం హీరోయిన్ గా రాణించింది. స్టార్స్ తో జతకట్టింది. అనేక బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్ కరీనా కపూర్ ఖాతాలో ఉన్నాయి. కరీనా కపూర్ తాజాగా శృంగార సన్నివేశాలను ఉద్దేశిస్తూ కీలక కామెంట్స్ చేసింది. కథను నడపడానికి ఆ సన్నివేశాలు తెరకెక్కించాల్సిన అవసరం లేదని ఆమె అభిప్రాయపడ్డారు.
Also Read: ఆ హీరోయిన్ ఉందంటే ఆ సినిమా పాన్ ఇండియా హిట్టు కొట్టినట్టేనా..?
సిల్వర్ స్క్రీన్ పై శృంగార సన్నివేశాలు చూసేందుకు భారతీయ ప్రేక్షకులు సిద్ధంగా లేరు. సదరు సన్నివేశాలను ఇబ్బందిగా ఫీల్ అవుతారు. పాశ్చాత్య దేశాల్లోని ప్రేక్షకులతో పోల్చితే మన ప్రేక్షకులు చూసే విధానం వేరుగా ఉంది. అది ఒక హ్యూమన్ హ్యూమన్ ఎక్స్ప్రీరియన్స్ లా భావించరు అని కరీనా కపూర్ అభిప్రాయపడ్డారు. కి అండ్ క తో పాటు కొన్ని సినిమాల్లో కరీనా కపూర్ శృంగార సన్నివేశాల్లో నటించడం విశేషం.
కరీనా కపూర్ ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తుంది. ఇటీవల కరీనా కపూర్ నటించిన ‘క్రూ’ మంచి విజయం అందుకుంది. టబు, కృతి సనన్ సైతం లీడ్ రోల్స్ చేశారు. కరీనా కపూర్ చివరి చిత్రం సింగం అగైన్. అజయ్ దేవ్ గన్ హీరోగా నటించాడు. రోహిత్ శెట్టి ఈ చిత్రానికి దర్శకుడు. కరీనా కపూర్ కెరీర్ ఆరంభంలో షాహిద్ కపూర్ ని ప్రేమించింది. కొన్నాళ్ళు వీరి రిలేషన్ కొనసాగింది. 2012లో నటుడు సైఫ్ అలీ ఖాన్ ని కరీనా కపూర్ వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు కుమారులు.
సైఫ్ అలీ ఖాన్ కి కరీనాతో రెండో వివాహం. ఇటీవల సైఫ్ అలీ ఖాన్ పై నివాసంలో దాడి జరిగింది. ఆగంతకుడు ఇంట్లోకి దూరి సైఫ్ అలీ పై కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన సైఫ్ అలీ ఖాన్ చికిత్స అనంతరం కోలుకున్నారు. సైఫ్ తెలుగులో ఆదిపురుష్, దేవర చిత్రాల్లో నటించాడు. ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర మూవీ మంచి విజయం సాధించింది. వరల్డ్ వైడ్ రూ. 500 కోట్ల వరకు వసూలు చేసింది. దేవర లో మెయిన్ విలన్ రోల్ సైఫ్ చేశాడు. దేవర 2లో సైతం ఆయన నటించనున్నాడు. దేవర చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది.