బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ‘కరీనా కపూర్’ ఇద్దరి బిడ్డలకు తల్లి. అయితే తాజాగా తాను రాసిన పుస్తకం ‘ప్రెగ్నెన్సీ బైబిల్’ లాంచ్ చేస్తూ.. ఈ సందర్భంగా ఈ బుక్ నా మూడో బిడ్డ లాంటిది’ అంటూ కరీనా సిగ్గు పడుతూ చెప్పింది. కరీనాలో మంచి హాట్ బ్యూటీ మాత్రమే ఉంది ఇన్నాళ్లు అనుకున్నారు అంతా. కానీ తనలోని రచయిత్రి కూడా ఉందని ఈ ముదురు భామ ఈ బుక్ తో నిరూపించింది.
ఇక తనలోని రచయిత్రిని నిద్ర లేపిన ఈ ‘ప్రెగ్నెన్సీ బైబిల్’ పుస్తకాన్ని ఆవిష్కరించడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని.. జీవితాంతం ఇది తనకు మరవలేని గొప్ప అనుభూతి అని కరీనా ఎమోషనల్ అయింది. ఇంతకీ ఈ పుస్తకంలో ఏమి రాసిందంటే… తన ఇద్దరి బిడ్డల్ని కడుపులో మోస్తున్న సమయంలో తానూ ఎలా ఫీల్ అయ్యాను, ఆ సమయంలో తన జీవితంలో జరిగిన అంశాలను ఈ బుక్ లో రాసిందట.
అన్నట్టు వంటగదిలో అవెన్ లోంచి ఈ బుక్ హాట్ హాట్ కాపీని బయటకు తీసి లాంచ్ చేయడం నిజంగా విశేషమే. ఇక కరీనా ఇద్దరు బిడ్డలను కడుపులో మోస్తున్నప్పటి క్షణాలను గుర్తు తెచ్చుకుంటూ అప్పటి అనుభవాలకు, ప్రెగ్నెన్సీ కష్టనష్టాలకు సంబంధించి కరీనా రాసుకొచ్చింది. అలాగే పలువురు నిపుణులు సలహాలు, సూచనలను కూడా ఈ బుక్ లో పొందుపరచింది.
అయితే ఇక్కడ మరో విశేషం ఏమిటంటే.. కరీనా పుస్తకానికి స్త్రీ వైద్య నిపుణులు, ప్రసూతి వైద్యుల అధికారిక సంస్థ నుండి అనుమతి లభించడంతో కరీనా ఆనందానికి అసలు అవధులు లేకుండా పోయింది. తనకు ఈ విషయంలో ఎంతో గర్వంగా ఉందని కరీనా చెప్పుకొచ్చింది, కరీనా కపూర్ 2020లో తన మొదటి బిడ్డ తైమూర్ నాలుగో పుట్టినరోజు సందర్భంగా ‘ప్రెగ్నెన్సీ బైబిల్’ అనే పుస్తకాన్ని తీసుకొస్తున్నట్టు ప్రకటించి.. మొత్తానికి ఈ పుస్తకాన్ని రిలీజ్ చేసింది.