Kantara 2 Collection Day 8: భారీ అంచనాల నడుమ రీసెంట్ గా విడుదలైన ‘కాంతారా 2′(Kanthara : The Chapter 1) చిత్రం డీసెంట్ స్థాయి వసూళ్లను నమోదు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తుంది. వారం రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ ట్రెండ్ ని ఒకసారి పరిశీలిస్తే, ఇండియన్ మార్కెట్ లో పర్వాలేదు అనే రేంజ్ ట్రెండ్ ని కనబరిచినప్పటికీ, ఓవర్సీస్ లో మాత్రం డిజాస్టర్ పెర్ఫార్మన్స్ ని నమోదు చేసుకుంటుంది. కానీ ఈ ఏడాది బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించి భారీ బ్లాక్ బస్టర్స్ గా నమోదు చేసుకున్న కూలీ, ఓజీ చిత్రాల ఫుల్ రన్ గ్రాస్ వసూళ్లను మొదటి వారం లోనే అధిగమించింది ఈ చిత్రం. సీక్వెల్ క్రేజ్ తో వచ్చిన ఈ సినిమాకు ఆ మాత్రం గ్రాస్ వసూళ్లు రావడం లో వింతేమీ లేదు కానీ, బ్రేక్ ఈవెన్ కి ఇప్పటి వరకు వచ్చిన వసూళ్లు అసలు సరిపోవని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్.
విడుదలకు ముందు ఓవరాల్ గా ఈ చిత్రానికి 342 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఇప్పటి వరకు 220 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే మరో 121 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది. ఒక సినిమాకు రెండవ వారం నుండి ఈ రేంజ్ షేర్ వసూళ్లు రావాలంటే రెండవ వారం నుండి వేరే లెవెల్ షేర్ హోల్డ్ ని కనబర్చాల్సిన అవసరం ఉంటుంది. కానీ ట్రెండ్ ని చూస్తుంటే కాంతారా 2 కి అంత రేంజ్ లేదని అనిపిస్తుంది. ఎంత రాబట్టిన ఈ వీకెండ్ లోనే రాబట్టాలి. ఆ తర్వాత దీపావళి కి బోలెడన్ని సినిమాలు విడుదల అవుతున్నాయి. బ్రేక్ ఈవెన్ అవ్వడం చాలా కష్టం. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ చిత్రం 41 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను బ్రేక్ ఈవెన్ కోసం రాబట్టాల్సి ఉంటుంది. సోమవారం నుండి రోజుకి కోటి రూపాయిల లెక్కన షేర్ వసూళ్లను హోల్డ్ చేస్తే కానీ బ్రేక్ ఈవెన్ అసాధ్యం అని అంటున్నారు ట్రేడ్ పండితులు.
ఒక్క కర్ణాటక రాష్ట్రంలో మాత్రం ఈ చిత్రం స్టడీ కలెక్షన్స్ ని నమోదు చేసుకుంటుంది. హిందీ వెర్షన్ వసూళ్లు రీసెంట్ గానే 115 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను నమోదు చేసుకుంది. ఇక ఓవర్సీస్ లో అయితే 68 కోట్ల రూపాయిల గ్రాస్ వద్దనే ఆగిపోయింది ఈ చిత్రం. ఒక్క నార్త్ అమెరికా లోనే ఈ చిత్రాన్ని 9 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసారు. ఇప్పటి వరకు కనీసం మూడు మిలియన్ డాలర్ల గ్రాస్ ని కూడా రాబట్టలేకపోయింది. ఇక మిగిలిన ఓవర్సీస్ మర్కెట్స్ లో అయితే పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. ఓవరాల్ గా ఈ చిత్రానికి మొదటి వారం లో 446 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, 220 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది.