Kannappa Trailer Prabhas Appearance : తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు సాగుతోంది. చాలామంది దర్శకులు కొత్త కథలతో సినిమాలను చేస్తూ వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇలాంటి సందర్భంలోనే గత 20 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన స్టామినా ఏంటో చూపించుకోవాలని మంచు విష్ణు (Manchu Vishnu) తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే వరుసగా సినిమాలు చేసినప్పటికి అతనికి ఒక్కటి కూడా సరైన హిట్ అయితే పడడం లేదు…ఇక వాళ్ల నాన్న మోహన్ బాబు (Mohan Babu) ఇమేజ్ ను వాడుకున్నప్పటికి ఇప్పటి వరకు ఆయన కెరియర్ లో చెప్పుకోవడానికి సరైన సక్సెస్ లేకుండా పోయింది. నిన్న మొన్న వచ్చిన యంగ్ హీరోలు సైతం మంచి సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళుతున్న క్రమంలో మంచు విష్ణు ఏం చేసినా కూడా అది ప్లాప్ గానే మిగులుతోంది. మరి ఇలాంటి సందర్భంలో ఆయన పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపును సంపాదించుకోవాలనే ఉద్దేశ్యంతో శివుడి పరమ భక్తుడు అయిన భక్త కన్నప్ప జీవిత కథ ఆధారంగా కన్నప్ప (Kannappa)అనే సినిమాను చేస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఈయన చేసిన సినిమాలు అన్నీ తక్కువ బడ్జెట్ సినిమాలే కావడం విశేషం…కానీ ఫస్ట్ టైం 150 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను చేస్తున్నాడు. గత కొద్దిసేపటి క్రితమే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది…
ఈ ట్రైలర్ ఆధ్యాంతం ప్రేక్షకులను మెప్పించే విధంగా ఉందనే చెప్పాలి. ఇక ఈ మూవీలో ప్రభాస్ (Prabhas) నటిస్తున్నాడు అంటూ సినిమా మీద భారీ బజ్ అయితే క్రియేట్ చేశారు. కొద్ది రోజుల క్రితం రిలీజ్ అయిన టీజర్ లో ప్రభాస్ కండ్లు మాత్రమే రెవీల్ చేశారు.
కానీ ఇప్పుడు రిలీజ్ అయిన ట్రైలర్ లో మాత్రం ప్రభాస్ ను రివిల్ చేస్తూ ఆయనకి ఒక ఐదు నుంచి ఆరు షార్ట్స్ అయితే పడే విధంగా చూసుకున్నారు. ఇక దాంతోపాటుగా ఆయనతో కొన్ని డైలాగులను కూడా చెప్పించారు… ఇక ఈ ట్రైలర్ లో ప్రభాస్ లుక్స్ చూస్తే డిఫరెంట్ గా ఉన్నాయి.
నిజ జీవితంలో ఆయన అలా లేడు మరి కావాలనే ప్రభాస్ షూట్ అయిపోయిన తర్వాత సీజి ద్వారా ఏమైనా అతని ఫేస్ లో మార్పులు చేర్పులు చేశారా? లేదంటే ఏఐ ద్వారా ప్రభాస్ ని క్రియేట్ చేసి ఇందులో ప్రభాస్ నటిస్తున్నాడు అని చెబుతున్నారా అంటూ సినిమా మేధావులు సైతం కొన్ని అనుమానాలైతే వ్యక్తం చేస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్లో ప్రభాస్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచాడు… ఆయన చెప్పిన డైలాగులు ట్రైలర్ లెవెల్ ని మార్చేశాయనే చెప్పాలి. ఇక ప్రభాస్ ను చూసినా ఆయన అభిమానులు సైతం ఆనంద పడుతున్నారు…