Pushpa Kannada version: అల్లు అర్జున్ ‘పుష్ప’ మూవీపై కన్నడ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమా విడుదల విషయంలో తమ కన్నడిగులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. పుష్ప కన్నడ వెర్షన్ విడుదల స్ట్రాటజీ సరిగా లేకపోవడంతో కర్ణాటక ప్రజలు ఈ మేరకు ‘బాయ్ కాట్ పుష్ఫ’ అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలుపెట్టారు.

‘పుష్ప’ రేపు ప్యాన్ ఇండియా లెవల్లో తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలవుతోంది. అయితే అన్ని మల్టీప్లెక్స్ లు, థియేటర్లలో తెలుగు, హిందీ, తమిళ వెర్షన్ లను ప్రదర్శిస్తున్నారు. కన్నడ డబ్బింగ్ చిత్రానికి పరిమిత థియేటర్లు మాత్రమే కేటాయించారు. ఇది తమ భాషకు అవమానం అంటూ కన్నడ అభిమానులు ‘పుష్ఫ’ టీంపై మండిపడుతున్నారు.
Also Read: కుటుంబ సభ్యులతో కలిసి పుష్ప సినిమా చూడబోతున్న అల్లు అర్జున్… ఏ ధియేటర్ లో అంటే ?
నిర్మాతలు థియేటర్లలో కన్నడ వెర్షన్ లో విడుదల చేయలేనప్పుడు సినిమాను కన్నడలో డబ్ చేయడం వల్ల ప్రయోజనం ఏమిటన్నది అభిమానుల ప్రధాన డిమాండ్. ఈ క్రమంలోనే కన్నడ ఫ్యాన్స్ ఇప్పుడు ట్విట్టర్ లో ‘బాయ్ కాట్ పుష్ప’ అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండింగ్ చేస్తున్నారు.
మీ సినిమాను కన్నడ భాషలో విడుదల చేయాలనుకుంటే అన్ని వెర్షన్ ల కంటే కన్నడ వెర్షన్ లోనే విడుదల చేయాలన్నది అభిమానుల డిమాండ్. తెలుగు వెర్షన్ ను 200+ థియేటర్లలో కర్ణాటకలో విడుదల చేస్తున్నారు. హిందీ వెర్షన్ ను 10+ థియేటర్లలో , మలయాళం వెర్షన్ 4+, తమిళ వెర్షన్ 4+ థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. అయితే కర్ణాటకలో కన్నడ వెర్షన్ ను మాత్రం 3 వెర్షన్ లలో మాత్రమే విడుదల చేస్తున్నారు. అని అభిమానులు కోపంగా ట్విట్టర్ లో పోస్ట్ చేస్తున్నారు.
Also Read: అల్లు అర్జున్ “పుష్ప” సినిమా రివ్యూ… బాక్స్ ఆఫీస్ కలెక్షన్ల లో తగ్గేదే లే