https://oktelugu.com/

Surya Kangua Movie :  అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తున్న కంగువా, సూర్య బారి బడ్జెట్ మూవీ ఎప్పుడు? ఎక్కడ చూడొచ్చు?

థియేటర్స్ లో కంగువా విడుదలై మూడు వారాలు మాత్రమే అవుతుంది. అప్పుడే ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. శివ దర్శకత్వంలో సూర్య నటించిన భారీ బడ్జెట్ మూవీ కంగువా... అధికారిక డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ వచ్చింది. ఈ ఫిక్షనల్ యాక్షన్ డ్రామా ఎక్కడ చూడొచ్చు? ఇంట్రెస్టింగ్ డిటైల్స్..

Written By:
  • S Reddy
  • , Updated On : December 6, 2024 / 08:37 PM IST

    Surya Kangua Movie

    Follow us on

    Surya Kangua Movie :  రెండేళ్లకు పైగా కంగువా చిత్రానికి సూర్య కష్టపడ్డారు. రెండు భిన్నమైన పాత్రలు చేశారు. వెయ్యి ఏళ్ల క్రితం నాటి ఓ తెగకు చెందిన వీరుడు కంగువా గా, అలాగే సమకాలీన నేపథ్యంలో ఫ్రాన్సిస్ అనే.. బౌంటీ హంటర్ రోల్స్ చేశాడు. కండువా చిత్రాన్ని దాదాపు రూ. 350 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మించారని సమాచారం. దర్శకుడు శివ కోలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చి ఉన్నారు. దానితో ప్రేక్షకుల్లో హైప్ ఏర్పడింది. కంగువా ట్రైలర్ సైతం ఆకట్టుకుంది.

    అయితే సినిమా ఆశించిన స్థాయిలో లేదని ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు. ఈ చిత్రానికి నెగిటివ్ రివ్యూలు పడ్డాయి. అవి వసూళ్లను దారుణంగా దెబ్బ తీశాయి. రెండో రోజు నుండే కలెక్షన్స్ పడిపోయాయి. తమిళనాడు కూడా కంగువా డిజాస్టర్ అయ్యింది. కంగువా చిత్రాన్ని కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. యూవీ క్రియేషన్స్ నిర్మాణ భాగస్వాములుగా ఉన్నారు. వరల్డ్ వైడ్ కంగువా కేవలం రూ. 100 కోట్ల గ్రాస్ మాత్రమే రాబట్టగలిగింది. దాంతో ఏకంగా రూ. 130 కోట్లకు పైగా నష్టాలు మిగిల్చింది ఈ చిత్రం.

    సినిమా థియేట్రికల్ రన్ ముగిసింది. అలాగే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ క్రమంలో అనుకున్న సమయానికి ముందే కంగువా ఓటీటీలోకి వచ్చేస్తుంది. కంగువా డిజిటల్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. డిసెంబర్ 8 నుండి స్ట్రీమింగ్ కి అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించారు. సూర్య ఫ్యాన్స్ మరోసారి చూసి ఎంజాయ్ చేయండి. కంగువా మరీ అంత బ్యాడ్ మూవీ కాదు. రివ్యూలు బాగా దెబ్బ తీశాయి. ఈ మూవీలో హీరో కార్తీ చివర్లో క్యామియో ఎంట్రీ ఇస్తాడు. ఆయన నెగిటివ్ రోల్ లో కనిపించారు.

    కంగువా ఓ తల్లికి ఆమె బిడ్డను నిలబెట్టుకోలేకపోతాడు. మరో జన్మలోనైనా నిన్ను ఆపద నుండి కాపాడతానని వాగ్దానం చేస్తాడు. ఆ పిల్లాడు, కంగువా మరోసారి జన్మిస్తారు. ఫ్రాన్సిస్ గా రష్యన్ మాఫియా వెంటాడుతున్న ఆ బాలుడిని కాపాడతాడు. కథ అసంపూర్తిగా చెప్పారు. పార్ట్ 2 కోసం దర్శకుడు అలా ప్లాన్ చేశాడు.