https://oktelugu.com/

‘కంగనా’ డప్పు కొట్టుకోవడం మళ్లీ మొదలెట్టింది !

బాలీవుడ్ హాట్ బ్యూటీ ‘కంగనా రనౌత్’ ఎప్పుడు స్లిమ్ గానే ఉంటుంది. కానీ జయలలిత బయోపిక్ ‘తలైవి’ సినిమా కోసం 15 కిలోల బరువు పెరిగిందని వార్తలు వచ్చాయి. ఇక కంగనా అయితే, తాను 20 కిలోలు పెరిగానని గర్వంగా చెప్పుకుంది. జయలలితలా కనిపించాలంటే కాస్త బొద్దుగా మారాల్సిన అవసరం ఉందని కూడా సెలవిచ్చింది. కానీ కంగనా ఎప్పుడు బరువు పెరిగిందో ఎవరికీ తెలియదు. ఆమె ఆ సినిమా జరుగుతున్నంత సేపు స్లిమ్ గానే కనిపించింది. ఆ […]

Written By:
  • admin
  • , Updated On : July 28, 2021 / 10:16 AM IST
    Follow us on

    బాలీవుడ్ హాట్ బ్యూటీ ‘కంగనా రనౌత్’ ఎప్పుడు స్లిమ్ గానే ఉంటుంది. కానీ జయలలిత బయోపిక్ ‘తలైవి’ సినిమా కోసం 15 కిలోల బరువు పెరిగిందని వార్తలు వచ్చాయి. ఇక కంగనా అయితే, తాను 20 కిలోలు పెరిగానని గర్వంగా చెప్పుకుంది. జయలలితలా కనిపించాలంటే కాస్త బొద్దుగా మారాల్సిన అవసరం ఉందని కూడా సెలవిచ్చింది. కానీ కంగనా ఎప్పుడు బరువు పెరిగిందో ఎవరికీ తెలియదు.

    ఆమె ఆ సినిమా జరుగుతున్నంత సేపు స్లిమ్ గానే కనిపించింది. ఆ సమయంలో ఇన్ స్టాగ్రామ్ లోని ఆమె ఫోటోలను, వీడియోలను చూస్తే తెలుస్తోంది కంగనా ఎంత బరువు పెరిగింది అని. మరి పైకి స్లిమ్ గా కనిపిస్తూ.. సినిమాలో కొన్ని సన్నివేశాల్లో బొద్దుగా కనిపించింది. అదెలా సాధ్యం ? ఈ బ్యూటీ చేసిన ఆ గిమ్మిక్ వెనుక రహస్యం ఏమై ఉంటుంది ? అంటూ నెటిజన్లు ఆరా తీస్తున్నారు.

    వారి ఆరా పై తనదైన శైలిలో స్పందిస్తూ.. తాజాగా ఒక ఫోటో పోస్ట్ చేసింది. జయలలిత బయోపిక్ కోసం బొద్దుగా మారాను, ఇప్పుడు మరో సినిమా కోసం ఇలా ఫిట్ గా మారాను అంటూ ఆ ఫోటోకి ఒక మెసేజ్ కూడా యాడ్ చేసింది. అప్పుడు, ఇప్పుడు అన్నట్లుగా రెండు ఫోటోలను షేర్ చేసిన ఈ బోల్డ్ భామ, తనను తానూ బాగా ప్రమోట్ చేసుకుంది.

    34 ఏళ్ల కంగనా త్వరలోనే “ధాకాడ్” అనే సినిమా చేయబోతుంది. ఇదొక యాక్షన్ థ్రిల్లర్ అని, ఈ సినిమా కోసమే కంగనా ఇలా ఫిట్ గా మారిందని తెలుస్తోంది. మొత్తానికి ప్రతి పాత్ర కోసం తాను ఎంతో కష్టపడతాను అంటూ కంగనా ఇచ్చే బిల్డప్ మామూలు బిల్డప్ కాదు. అసలు ప్రపంచంలోనే తనలా వైవిధ్యం చూపే మరో నటి లేదని ఆ మధ్య తనకు తానూ కొట్టుకున్న డప్పు గురించి అందరికీ తెలిసిందే.