
‘కంగనా రనౌత్’.. సందర్భం ఏదైనా, ఎదురు వ్యక్తి ఎవరైనా ఎప్పుడూ ఒకేలా ప్రవర్తించడం ఆమె నైజం. మొత్తమ్మీద కంగనా తీరు చాలా మందిని చాలా సంవత్సరాలుగా తీవ్రంగా బాధిస్తూనే ఉంది. అంతమందిని బాధ పెడుతూ తనంతటి మంచిది మరొకరు లేరు అనడం కంగనా ప్రత్యేకత. ఇక ప్రస్తుత విషయానికి వస్తే.. నూతన వధువుగా యామీ గౌతమ్ సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.
పాపం లేటు వయసులో పెళ్లి అయింది, ఆ మాత్రం హడావుడి చేయకపోతే ఎలా ? అందుకే యామీ గౌతమ్ తన వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలను వరుసగా పోస్ట్ చేస్తూ తెగ మురిసిపోతుంది. అయితే, ఏమాటకామాటే చెప్పుకోవాలి. ఫోటోల్లో సాంప్రదాయ దుస్తుల్లో యామీ ధగధగ మెరిసిపోతూ అందాల కుందనాల బొమ్మలా ఉంది.
దాంతో యామీ పెళ్లి ఫోటోల పై బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ప్రశంసలు కురిపిస్తోంది. ఈ క్రమంలో కంగనా కూడా స్పందిస్తూ.. ‘యామీ సూపర్ గా ఉన్నావ్’ అంటూ ఓ కామెంట్ పెట్టింది. ఈ కామెంట్ తో ఆగిపోతే కంగనా ఎందుకు అవుతుంది. అందుకే, యామీ ఫోటోల పై స్పందించిన మిగిలిన బాలీవుడ్ ప్రముఖుల పై తనదైన శైలిలో విమర్శిస్తూ రెచ్చిపోయింది.

వైవిధ్యమైన హీరో ఆయుష్మాన్ ఖురానా యామీ ఫోటో పై కామెంట్ పెడుతూ ‘యామీ ఎంతో సింపుల్‌గా రెడీ అయింది’ అని మెసేజ్ పెట్టాడు. ఈ పోస్ట్ చూసిన కంగనా రెచ్చిపోతూ ‘ఒక విషయాన్ని సింపుల్ అని నిర్ధారించడం ఎంత కష్టమో నీకు తెలుసా?’ అంటూ ఆయుష్మాన్ కు చిన్నపాటి క్లాస్ తీసుకుంది. ఇక యామీని అచ్చం రాధేమాలా ఉందన్న విక్రాంత్ మాస్సే పై మాత్రం కంగనా ఓ రేంజ్ లో తిట్ల పురాణం అందుకుంది.

‘ఈ బొద్దింక ఎక్కడ నుంచి వచ్చింది? నా చెప్పులు తీసుకురండి, దీని సంగతి చూస్తా’ అంటూ విక్రాంత్ ను చులకన చేసింది. యామీ గౌతమ్, ‘ఉరి’ డైరెక్టర్ ఆదిత్యను శుక్రవారం పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.