Kalvakuntla Kavitha Comments On Ram Charan: ఈమధ్య కాలం లో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) పేరు ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతుందో మనమంతా చూస్తూనే ఉన్నాము. బీఆర్ఎస్ పార్టీ నుండి బయటకు వచ్చిన ఆమె, ఆ పార్టీ పై తీవ్రమైన విమర్శలు చేయడం సంచలనంగా మారింది. ఒకపక్క రాజకీయాల్లో ఈమె ఇంత బిజీ గా గడుపుతూ, అప్పుడప్పుడు సినిమా ఈవెంట్స్ లో కూడా తళుక్కుమని మెరుస్తోంది. రీసెంట్ గానే ఆమె ‘గుమ్మడి నర్సయ్య’ మూవీ షూటింగ్ ప్రారంభోత్సవానికి వచ్చింది. ఇందులో టైటిల్ క్యారక్టర్ ని కన్నడ సూపర్ స్థార్ శివ రాజ్ కుమార్ చేస్తున్నాడు. ఈ సినిమా ఈవెంట్ లో పాల్గొన్న కవిత, రీసెంట్ గా ట్విట్టర్ లో తన అభిమానులతో ఒక చిట్ చాట్ నిర్వహించింది. ఈ చిట్ చాట్ లో ఆమె రామ్ చరణ్(Global star Ram Charan) గురించి ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
ఒక అభిమాని ‘రామ్ చరణ్ గురించి ఒక్క మాటలో చెప్పండి’ అని అడుగుతాడు. అందుకు కవిత స్పందిస్తూ ‘రామ్ చరణ్ గొప్ప నటుడు, డ్యాన్సర్. వ్యక్తిగతంగా కూడా ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్త్వం. అయితే నేను మెగాస్టార్ చిరంజీవి గారికి వీరాభిమాని కాబట్టి, రామ్ చరణ్ చిరంజీవి కంటే గొప్ప డ్యాన్సార్ కాదు’ అని చెప్పుకొచ్చింది. ఈ కామెంట్ ని మెగా అభిమానులు పాజిటివ్ గానే తీసుకున్నారు. కానీ కొంతమంది రామ్ చరణ్ అభిమానులు మాత్రం కవిత పై మండిపడుతున్నారు. రామ్ చరణ్ మాత్రమే గొప్ప , ఆయన డ్యాన్స్ మాత్రమే బాగుంటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే కవిత మెగాస్టార్ చిరంజీవి కి వీరాభిమాని అని అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చింది. కానీ ఈమె పవన్ కళ్యాణ్ పై గత పదేళ్ల నుండి విమర్శలు చేస్తూనే ఉంది. ఉపముఖ్యమంత్రి అయ్యాక కూడా ఆయనపై ఈమె చేసిన కామెంట్స్, అందుకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇచ్చిన కౌంటర్లు నేషనల్ లెవెల్ లో ట్రెండ్ అయ్యాయి.
Personally very Humble.
Great dancer .. but I am a Chiru fan .. so not greater than Chiranjeevi Garu https://t.co/L09sN5H5Du— Kavitha Kalvakuntla (@RaoKavitha) December 15, 2025