Kalki 2: ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి’ సినిమా తెలుగులో సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది. 1000 కోట్లకు పైన కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమాకి కల్కి 2 అంటూ సీక్వెల్ ను కూడా అనౌన్స్ చేశారు. అయితే ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటిస్తున్నప్పటికి కల్కి అవతారంలో వచ్చే ఒక హీరో అయితే కావాలి మరి ఆ అవతారంలో నటించడానికి ఏ హీరోని సెలెక్ట్ చేసుకుంటున్నారు అనేది గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారమైతే కల్కి క్యారెక్టర్ లో ఇతర భాషల హీరోని ఎంపిక చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది… ఇక మొన్నటి దాకా తేజ సజ్జా ఈ సినిమాలో నటించబోతున్నాడు అంటు కొన్ని వార్తలైతే వచ్చాయి.
ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారమైతే తేజ సజ్జా ను ఇందులో భాగం చేయడం లేదనే వార్తలైతే వస్తున్నాయి. తమిళ్ సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్న చియాన్ విక్రమ్ కొడుకు అయిన ధృవ్ విక్రమ్ ను ఈ సినిమాలో కల్కి పాత్ర కోసం తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారట. రీసెంట్ గా ధృవ్ విక్రమ్ ‘బైసన్’ సినిమాతో తమిళ్, తెలుగులో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.
కాబట్టి అతను అయితేనే ఆ పాత్రకి బాగా సెట్ అవుతాడనే ఉద్దేశ్యంతో నాగ్ అశ్విన్ ఉన్నాడట. ఇక తను అనుకుంటున్నట్టుగానే ఈ సినిమాతో ఎలాంటి ఐడెంటిటి క్రియేట్ చేసుకుంటాడు ధృవ్ విక్రమ్ ఈ సినిమాలో తన నటనతో మరోసారి ప్రశంసలను అందుకుంటాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
ఇక ప్రస్తుతం ప్రభాస్ స్పిరిట్ సినిమా షూటింగ్లో ఉన్నాడు. కాబట్టి ‘కల్కి 2’ సినిమా షూటింగ్ ను ఈ సంవత్సరం ఎండింగ్లో స్టార్ట్ చేసే అవకాశాలైతే ఉన్నాయి. స్పిరిట్ సినిమా పూర్తయ్యేంత వరకు ప్రభాస్ ఇతర ఏ సినిమాల్లో నటించకూడదు అనే కండిషన్ అయితే సందీప్ రెడ్డి వంగ పెట్టాడు…దాంతో స్పిరిట్ సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ప్రభాస్ ‘కల్కి 2’ సినిమా చేసే అవకాశాలైతే ఉన్నాయి…