https://oktelugu.com/

Balakrishna: ‘తెర’మీద కాకినాడ పోర్టు మాఫియా.. బాలకృష్ణ సిద్ధం!

మాఫియా నేపథ్యంలో వచ్చిన చాలా సినిమాలు సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి. అందుకే ఇప్పుడు కాకినాడ పోర్టు మాఫియా పై సినిమా తీసేందుకు చాలా మంది సిద్ధపడుతున్నారు. నందమూరి బాలకృష్ణ సైతం సిద్ధం అని ప్రకటించారు.

Written By:
  • Dharma
  • , Updated On : December 7, 2024 / 11:57 AM IST

    Balakrishna

    Follow us on

    Balakrishna: కాకినాడ పోర్ట్ ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్. అసలు అక్కడ ఒక పోర్టు ఉందని.. దాని వెనుక ఇంత మాఫియా నడుస్తోందని ఇదివరకు ఎన్నడూ బయట పడలేదు. పవన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాకినాడ పోర్టు ద్వారా రేషన్ మాఫియా నడుస్తోందని ఆరోపణలు చేశారు. తద్వారా సంచలన విషయాన్ని బయటపెట్టారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత నేరుగా సముద్రంలోకి వెళ్లి రేషన్ బియ్యం తరలిస్తున్న షిప్ ను పరిశీలించారు. సంచలనాలకు కారణం అయ్యారు. వాస్తవానికి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కాకినాడ పోర్టుపై ఫోకస్ పెరిగింది. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తరచూ పర్యటనలు చేశారు. రేషన్ పక్కదారి పడుతోందంటూ సంచలన ఆరోపణలు చేయడంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. పవన్ నేరుగా స్పందించేసరికి ఇది హైలెట్ అయ్యింది. ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. ఈ నేపథ్యంలో కాకినాడ పోర్టు మాఫియా పై సినిమా చేస్తానంటూ సినీ హీరో, టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చెప్పారు. కాకినాడలో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమానికి బాలకృష్ణ హాజరయ్యారు. బాలకృష్ణ తో పాటు హీరోయిన్ సంయుక్త మీనన్ కూడా పాల్గొన్నారు. దీంతో అభిమానులు ఒక్కసారిగా చుట్టుముట్టారు. అదే సమయంలో మీడియాతో మాట్లాడుతూ బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు.

    * అభిమానం వెలకట్టలేనిది
    గోదావరి ప్రజల అభిమానం వెలకట్టలేనిది అన్నారు బాలకృష్ణ. ఉన్నది ఉన్నట్టు నిర్మొహమాటంగా మాట్లాడడం గోదారి నీళ్లలోనే ఉందంటూ చెప్పుకొచ్చారు. తన మామ గారిది కూడా పామర్రు అంటూ చెప్పారు. ఈ సందర్భంగా కాకినాడ పోర్టు మాఫియా పై సినిమా చేస్తారా అంటూ ఓ విలేకరి బాలకృష్ణను ప్రశ్నించారు. దీంతో కదా సిద్ధం చేస్తే సినిమా చేయడానికి సిద్ధమేనంటూ స్పష్టం చేశారు బాలకృష్ణ. ప్రస్తుతం బాలకృష్ణ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

    * మోక్షజ్ఞ సినిమాపై స్పష్టత
    మరోవైపు కుమారుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ పై కూడా స్పష్టత ఇచ్చారు బాలకృష్ణ. ఆదిత్య 999 సినిమా ద్వారా మోక్షజ్ఞ వెండితెరపై అరంగేట్రం చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఆ సినిమాకు బాలకృష్ణ దర్శకుడు అన్న ప్రచారం ఉంది. దీనిపై స్పష్టత కోసం విలేకరులు ప్రశ్నించారు. అయితే సంగీతం శ్రీనివాసరావు ఉన్నారు కదా అంటూ బాలకృష్ణ బదులిచ్చారు. కాగా బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో కొనసాగుతోంది. సంక్రాంతికి ఆయన నటించిన డాకు మహారాజ్ సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. జనవరి 12న విడుదలకు ముస్తాబయింది. కాగా ఈ చిత్రానికి దర్శకుడు బాబి. బాలకృష్ణ చిత్రం విడుదల సమయంలోనే శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ చేంజర్ విడుదల కానుంది. అటు విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం కూడా రిలీజ్ అవుతుంది.