
Kajal Aggarwal: పెళ్లి అయినా హీరోయిన్లు మాత్రం గర్భవతి అవ్వడానికి పెద్దగా ఇష్టపడరు. అందం తరిగిపోతుందని వారి బాధ. కానీ కాజల్ అగర్వాల్ మాత్రం తాను ఎప్పుడు గర్భవతిని అవుతానా అంటూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసింది. కాజల్ కి పిల్లలు అంటే చాలా ఇష్టం అన్న విషయం తెలిసిందే. ఆ మధ్య తాను పిల్లల కోసమైన పెళ్లి చేసుకోవాలి అంటూ ఓపెన్ స్టేట్ మెంట్ కూడా ఇచ్చింది. మొత్తానికి తన కలను నెరవేర్చుకుంది కాజల్.
అయితే, కాజల్(Kajal Aggarwal) గర్భం దాల్చడంతో నాగార్జున హీరోగా రాబోతోన్న ‘ది ఘోస్ట్’ సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఐతే, కాజల్ ఈ సినిమా వ్యవహారాన్ని ఇంకా బయటపెట్టలేదు. అలాగే తనకు సంబంధించిన అప్ డేట్లును కూడా బయటకు రివీల్ చెయ్యట్లేదు. దేనికైనా సరైన టైం కావాలి అంటుంది. సరైన టైమ్ చూసి అన్నీ వివరంగా చెబుతుందట.
ఇంతకీ ఆ టైమ్ ఏమిటంటే.. డెలివరీ టైమ్. అవును తన డెలివరీకి టైమ్ దగ్గర పడినప్పుడు అన్నీ విషయాలు చెబుతుందట. పనిలో పనిగా అమ్మగా మారుతున్న క్షణాలు ఎలా ఉంటాయి, అసలు పెళ్లి అయ్యాక, అమ్మాయిలు ఎలాంటి ఆనందాలను ఎలా అనుభవించాలి లాంటి సంగతులు కూడా కాజల్ వివరంగా చెబుతూ ఒక సిరీస్ లా వీడియోస్ కూడా చేస్తోందట.

ఎందుకు అంటే.. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ మీద కూడా ఇన్ కమ్ పెంచుకోవడానికి. అప్పటి వరకూ తన గర్భం గురించి బయటకు తెలియనివ్వకుండా కాజల్ జాగ్రత్త పడుతుంది. అందుకే, ప్రస్తుతం కాజల్ సోషల్ మీడియాలో షేర్ చేస్తోన్న ఫోటోల్లో తన కడుపు కనిపించకుండా చాలా జాగ్రత్త స్టిల్స్ ను తీయించుకుని వదులుతుంది.
ఇక 36 ఏళ్ల ముదురు చందమామ గతేడాది తన ప్రియుడు గౌతమ్ కిచ్లుని పెళ్లి చేసుకుంది. అంతేనా ఫస్ట్ యానివర్సరీ వచ్చేలోపు అతని కారణంగా తల్లి కూడా అయింది. అన్నట్టు డెలివరీ తర్వాత రెండేళ్ళు పాటు ఇంటికే పరిమితం అవుతుందట. ఆ తర్వాత మళ్లీ తీరిగ్గా మళ్ళీ కొత్త ఇన్నింగ్స్ షురూ చేయాలని తెగ ఉబలాట పడుతుంది.
Also Read: కాజల్ పోస్ట్ వెనుక మర్మం ఇదేనా ?