https://oktelugu.com/

ఫోటోలు షేర్ చేసిన కాజల్.. ఉడికిపోతున్న అభిమానులు

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఫాలోయింగ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. యువతలో ఆమెకు మంచి క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ మూలానే దశాబ్ద కాలం నుండి స్టార్ హీరోయిన్ స్టేటస్ అనుభవిస్తోంది కాజల్. కానీ ఉన్నట్టుండి ఆమె తన పెళ్లి ప్రకటన చేయడంతో అభిమానులు షాకయ్యారు. కాజల్ కు పెళ్లా అంటూ డీలాపడ్డారు. ఒకవైపు ఆమె పెళ్లి వార్త సంతోషించదగినదే అయినా ఎందుకో కుర్రకారు జీర్ణించుకోలేకపోయారు. Also Read: బిగ్ బాస్-4: దివి, దేవి ఎలిమినేషన్.. […]

Written By: , Updated On : October 26, 2020 / 06:00 PM IST
Kajal Fiance
Follow us on

Kajal Fiance
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఫాలోయింగ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. యువతలో ఆమెకు మంచి క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ మూలానే దశాబ్ద కాలం నుండి స్టార్ హీరోయిన్ స్టేటస్ అనుభవిస్తోంది కాజల్. కానీ ఉన్నట్టుండి ఆమె తన పెళ్లి ప్రకటన చేయడంతో అభిమానులు షాకయ్యారు. కాజల్ కు పెళ్లా అంటూ డీలాపడ్డారు. ఒకవైపు ఆమె పెళ్లి వార్త సంతోషించదగినదే అయినా ఎందుకో కుర్రకారు జీర్ణించుకోలేకపోయారు.

Also Read: బిగ్ బాస్-4: దివి, దేవి ఎలిమినేషన్.. ఓటింగ్ పై అనుమానాలు..!

అప్పటి నుండి కాజల్ వివాహమాడబోయే అదృష్టవంతుడు ఎవరో తెలుసుకోవాలని ఉవ్విళ్ళూరారు. వరుడి పేరు గౌతమ్ కిచ్లు అని అతనికి ఇంటీరియర్ డిజైన్ వ్యాపారం ఉందని మాత్రమే తెలిసింది. ఎప్పటివో ఫోటోలు బయటికొచ్చినా లేటెస్ట్ ఫోటోలు, ఇద్దరికి కలిసి ఉన్న ఫోటోలు రాలేదు. దీంతో కాజల్ నిన్న దసరా సందర్బంగా కాబోయే భర్తతో కలిసి పండుగను సెలబ్రేట్ చేసుకుని నాలుగు మంచి ఫోటోలను దిగి సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Also Read: ‘డార్క్’ వెబ్ సిరీస్ వెనుక మహేష్ హస్తం ఉందా?

మా నుండి మీకు దసరా శుభాకాంక్షలు.. కాజ్ గౌత్ కిచ్డ్ అంటూ సరదా క్యాప్షన్ కూడ తగిలించింది. అది చూసిన ఆమె ఫ్యాన్స్ జంట బాగుందని సంతోషపడుతూనే ఇంకోవైపు గౌతమ్ కిచ్లును చూసి లక్కీ బాయ్ అంటూ ఉడికిపోతున్నారు. ఇకపోతే వీరి వివాహం ఈ నెల 30న కొద్దిమంది ఆప్తుల సమక్షంలో జరగనుంది. పెళ్లి తరవాత కూడ కాజల్ నటిగా కొనసాగుతానంటోంది. ప్రస్తుతం ఆమె చేతిలో ‘ఆచార్య, ఇండియన్ 2’ లాంటి భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి.