https://oktelugu.com/

పరిధులు దాటేస్తున్న కాజల్.. భర్త నుండి కూడా గ్రీన్ సిగ్నల్ !

‘కాజల్ అగర్వాల్’ పెళ్లి చేసుకున్న వారానికే సినిమా షూటింగ్ కోసం పరుగులు పెట్టింది. మరి అలాంటి కాజల్ నుండి హౌస్ వైఫ్ పాత్రను ఎలా ఆశించగలం. పైగా ఆమె భర్త కూడా కాజల్ కి ఏమి కావాలో ఇప్పుడిప్పుడే అర్ధం చేసుకుంటున్నాడట. అందుకే, ఆమెకు అన్ని విషయాల్లో నీ ఇష్టం అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. దాంతో 36 ఏళ్ల కాజల్ మళ్ళీ సినిమాల్లో బిజీ అవ్వడానికి పరిధులు కూడా దాటేస్తాను అంటూ మూవీ మేకర్స్ కి […]

Written By:
  • admin
  • , Updated On : June 14, 2021 / 12:46 PM IST
    Follow us on

    ‘కాజల్ అగర్వాల్’ పెళ్లి చేసుకున్న వారానికే సినిమా షూటింగ్ కోసం పరుగులు పెట్టింది. మరి అలాంటి కాజల్ నుండి హౌస్ వైఫ్ పాత్రను ఎలా ఆశించగలం. పైగా ఆమె భర్త కూడా కాజల్ కి ఏమి కావాలో ఇప్పుడిప్పుడే అర్ధం చేసుకుంటున్నాడట. అందుకే, ఆమెకు అన్ని విషయాల్లో నీ ఇష్టం అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. దాంతో 36 ఏళ్ల కాజల్ మళ్ళీ సినిమాల్లో బిజీ అవ్వడానికి పరిధులు కూడా దాటేస్తాను అంటూ మూవీ మేకర్స్ కి ఇన్ డైరెక్ట్ సిగ్నల్స్ పాస్ చేస్తోంది.

    ఈ క్రమంలో ఫోటో షూట్లతో సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ఆదివారం ఒకే రోజే ఏకంగా మూడు రకాల ఫోటోషూట్ ఫోటోలను షేర్ చేసి.. సెగలు పుట్టించింది. ఏ అవకాశాన్ని వదిలిపెట్టకుండా ఇటు వెబ్ సిరీసులతో పాటు అటు సినిమాలను కూడా వరుసగా ఒప్పుకుంటూ ఒక్క రోజు గ్యాప్ కూడా లేకుండా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటోంది. ఇటీవల, హిందీలో ‘ఉమా’ అనే పేరుతో ఒక హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాని చేయడానికి ఆల్ రెడీ అయింది.

    అలాగే నాగార్జున సరసన ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో రానున్న మూవీలో కూడా కాజల్ హీరోయిన్ గా చేస్తోంది. ఇక పెళ్ళికి ముందే ఒప్పుకున్న చిరంజీవి ‘ఆచార్య’, కమల్ హాసన్ ‘ఇండియన్ 2’ సినిమాలు ఎలాగూ ఉండనే ఉన్నాయి. ఏది ఏమైనా ‘కాజల్ అగర్వాల్’ భర్త గౌతమ్, తన భార్య విషయంలో ఎంతో సహృదయంతో ఉంటాడట. అందుకే తానూ చేసే ప్రతి తప్పును నా భర్తకి చెప్పే చేస్తాను అంటూ ఓ ఇంటర్వ్యూలో తన భర్త గురించి మురిసిపోయింది.

    కాజల్ భర్త గౌతమ్ ఒక ఇంటీరియర్ కంపెనీకి ఓనర్. అయితే, మనకు పిల్లలు కలిగేంతవరకు మాత్రమే నువ్వు నటించాలి, ఆ తర్వాత ఇంటికే పరిమితం అవ్వాలి అంటూ కాజల్ ఒక కండిషన్ పెట్టాడు. ఎలాగూ కాజల్, సినిమా ఛాన్స్ లు వచ్చే వరకూ పిల్లలను కనే ఉద్దేశ్యం లేదని ఇప్పటికే పలుమార్లు చెప్పింది. ఏది ఏమైనా 1 6 ఏళ్ళ వయసులోనే ముఖానికి మేకప్ వేసుకుని సెగలు పుట్టించే గ్లామర్ తో దాదాపు పదిహేను ఏళ్ళ పాటు కుర్రాళ్లకు అందాల కనువిందు చేస్తోంది కాజల్ అగర్వాల్.