kacha badam singer bhuban badyakar: ఒకప్పుడు సినిమాల్లో నటిస్తేనే సెలబ్రిటీలు అనేవారు. ఆ సినిమాలో ఏదో ఒక విభాగంలో రాణించిన వారికి మాత్రమే స్టార్ స్టేటస్ ఉండేది. కానీ సోషల్ మీడియా పుణ్యమా అని కొందరు రాత్రికి రాత్రే పెద్ద సెలబ్రిటీలు అయిపోతున్నారు. ఎక్కడో రోడ్ల మీద ఉండే వారు కూడా దేశం మొత్తం పాపులర్ అవుతున్నారంటే.. ఆ క్రెడిట్ అంతా సోషల్ మీడియాదే. తమ ట్యాలెంట్ తో దేశం మొత్తాన్ని వావ్ అనిపిస్తున్నారు.

గతంలో రేణు మొండల్ ఎలా పాపులర్ అయిందో తెలిసిందే. అయితే ఈసారి పల్లీలు అమ్ముకునే కచ్చా బాదామ్ సింగర్ భూబన్ బద్యాకర్ రాత్రికి రాత్రే పెద్ద స్టార్ అయిపోయాడు. ఆయన పాడిన ఒక్క పాట కోసం సెలబ్రిటీలు కూడా పోటీ పడుతున్నారంటే.. ఎంత క్రేజ్ తెచ్చుకున్నాడో అర్థం చేసుకోవచ్చు. ఆయన పాడిన కచ్చా బాదామ్ పాటకు ఇండియన్ టాప్ సెలబ్రిటీల దగ్గరి నుంచి సామాన్యుల వరకే ఒకటే రీల్స్ చేస్తున్నారు.
Also Read: భీమ్లానాయక్ కలెక్షన్ల వర్షం: 4వ రోజు కలెక్షన్లు ఇవీ
ఇక ఈ పాటను డిజే మిక్స్ చేస్తే అది కూడా తిరుగులేకుండా ఏకంగా 50 మిలియన్ వ్యూస్ సంపాదించింది. మరి ఇంత పాపులర్ అయితే దిష్టి తగిలిందో ఏమో తెలియదు గానీ.. ఇప్పుడు ఆ కచ్చా బాదామ్ సింగర్‌కు యాక్సిడెంట్ అయింది. పశ్చిమ బెంగాల్ కు చెందిన భూబన్ బద్యాకర్‌తో చాలా మ్యూజిక్ కంపెనీలు ఆయనతో పాటు పాడిస్తున్నాయి. దీంతో అతను రెమ్యునరేషన్ కూడా బాగా పెంచేసి తన లైఫ్ స్టైల్ ను ఛేంజ్ చేసుకున్నాడు. ఇందులో భాగంగానే సెకండ్ హ్యాండ్ కారు కూడా కొన్నాడు.

అయితే ఈ కారు నడపడం నేర్చుకునే సమయంలోనే అదుపు తప్పి ప్రమాదానికి గురయ్యాడు. ఛాతీకి బలమైన గాయం అయినట్టు తెలుస్తోంది. కుటుంబీకులు ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించారు. చాలా చిన్న స్థాయి నుంచి వచ్చి పెద్ద సెలబ్రిటీ అయ్యాడు కాబట్టే దిష్టి తగిలిందంటూ అంటున్నారు నెటిజన్లు. ఆయన స్వస్థలం పశ్చిమ బెంగాల్ లోని లక్ష్మీనారాయణపూర్ కురల్జురీ గ్రామం.
Also Read: వైఎస్ వివేకా అల్లుడి సంచలన స్టేట్ మెంట్.. జగన్ పైనే ఆరోపణలు?