
“Kabzaa” OTT release : భారీ బడ్జెట్ తో భారీ తారాగణంతో తెరకెక్కిన పాన్ ఇండియన్ చిత్రం ‘కబ్జా’ ఇటీవలే విడుదలై డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది.సుమారుగా 120 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా కన్నడ సినీ పరిశ్రమలోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన మొట్టమొదటి చిత్రం గా నిల్చింది..చాలా కాలం తర్వాత ఉపేంద్ర నుండి వస్తున్న పాన్ ఇండియన్ సినిమా కావడం, దానికి తోడు కన్నడ సూపర్ స్టార్స్ కిచ్చా సుదీప్ మరియు శివరాజ్ కుమార్ వంటి నటులు ఉండడం తో ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉండేవి.
కానీ ఆ అంచనాలకు తగ్గట్టుగా సినిమా ఏమాత్రం లేకపోవడం తో ఓపెనింగ్స్ చాలా తక్కువగా వచ్చాయి.ఒకవేళ సూపర్ హిట్ టాక్ వచ్చి ఉంటే మాత్రం ఓపెనింగ్స్ అదిరిపోయేవి, వారం రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కుని కూడా దాటి ఉండేది అని చెప్పొచ్చు.
అయితే ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ని చూస్తూ ఉంటే క్లోసింగ్ లో కనీసం 50 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు కూడా వచ్చేలా లేదు.అందుకే ఈ చిత్రాన్ని ఓటీటీ లో తిందరగా విడుదల చెయ్యాలని ఆలోచిస్తున్నారు నిర్మాతలు.ఈ సినిమాకి సంబంధించి అన్ని భాషలకు కలిపి అమెజాన్ ప్రైమ్ సంస్థ సుమారుగా 150 కోట్ల రూపాయలకు డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకుంది.
ఒప్పందం ప్రకారం ఈ సినిమాని ఏప్రిల్ 13 వ తారీఖున విడుదల చెయ్యాలి, కానీ సినిమాకి ఫ్లాప్ టాక్ రావడం తో ఈ నెలాఖరున అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేసుకోనిస్తే అదనంగా మరో 50 కోట్ల రూపాయిలు ఇస్తామని డీల్ చెప్పారట.అంటే ఈ చిత్రాన్ని మనం ఈ నెల 30 వ తారీఖున అమెజాన్ ప్రైమ్ లో చూడొచ్చు అన్నమాట.సిల్వర్ స్క్రీన్ మీద అలరించలేకపోయిన ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను అయినా అలరిస్తుందో లేదో చూడాలి.