K Ramp Movie 4 Days Collections: కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘k ర్యాంప్'(K Ramp Movie) బాక్స్ ఆఫీస్ వద్ద సర్ప్రైజ్ హిట్ గా నిల్చింది. విడుదలకు ముందు ఈ సినిమా పై ఆడియన్స్ కి ఈ సినిమాపై అసలు అంచనాలే ఉండేవి కాదు. కిరణ్ అబ్బవరం సినిమాలు రొటీన్ గానే ఉంటాయి, ఆయన సినిమాలను థియేటర్స్ కి వెళ్లి చూసేంత సీన్ లేదులే అని అనుకునేవారు. మొదటి రోజు మొదటి ఆట నుండే రివ్యూయర్స్ నుండి దారుణమైన నెగిటివ్ రివ్యూస్ ని సొంతం చేసుకుంది. కానీ ఆడియన్స్ నుండి పాస్ మార్కులు పడడంతో ఈ దీపావళి కి విడుదలైన అన్ని సినిమాలను డామినేట్ చేస్తూ దీపావళి విన్నర్ గా నిల్చింది ఈ చిత్రం. ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న లెక్కల ప్రకారం 81 శాతం కి పైగా రీకవరీ అయ్యిందట. మొత్తం మీద నాలుగు రోజులకు ప్రపంచవ్యాప్తంగా ఎంత వసూళ్లు వచ్చాయో ఒక లుక్ వేద్దాం.
ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం చూస్తే, ఈ చిత్రానికి నాల్గవ రోజున తెలుగు రాష్ట్రాల నుండి కోటి 10 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది అట. అదే విధంగా కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ ప్రాంతాలకు కలిపి మరో 30 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చే అవకాశం ఉంది. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి 4 రోజుల్లో 7 కోట్ల 37 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే ఇక కేవలం కోటి 63 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వస్తే చాలు. ఈరోజు కూడా ఈ చిత్రానికి డీసెంట్ స్థాయిలో వసూళ్లు మార్నింగ్ షోస్ మొదలు అయ్యాయి. ఇదే జోరుని కొనసాగిస్తూ వెళ్తే, రాబోయే రెండు రోజుల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని కిరణ్ అబ్బవరం కెరీర్ లో క్లీన్ హిట్ మూవీ గా నిలుస్తుంది.
సోషల్ మీడియా లో ఉన్న నెగిటివిటీ ని తట్టుకోవడమే కాకుండా, పోటీలో మూడు సినిమాలను ఎదురుకొని ఈ చిత్రం నిలబడడం సామాన్యమైన విషయం కాదు. రాబోయే రోజుల్లో ఈ సినిమా ఇంకా ఎంత పెద్ద రేంజ్ కి వెళ్తుంది అనేది చూడాలి. ఈ సినిమా ని చూసిన ప్రతీ ఒక్కరు చెప్తున్నది ఏమిటంటే, ఇది 20 కోట్ల షేర్ ని రాబట్టగలిగే కెపాసిటీ ఉన్న సినిమా అని. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే ఈ చిత్రానికి కచ్చితంగా 14 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకవేళ సినిమాకు లాంగ్ రన్ ఉంటే 20 కోట్లు కూడా రావొచ్చు.