Junior NTR: #RRR వంటి సెన్సేషన్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ రేంజ్ పాన్ ఇండియా నుండి పాన్ వరల్డ్ కి ఎగబాకిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఎన్టీఆర్ తో సినిమాలు చెయ్యడానికి టాలీవుడ్ నుండి హాలీవుడ్ వరకు దర్శక నిర్మాతలు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ తో ‘దేవర’ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే.
రీసెంట్ గానే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చెయ్యగా దానికి ఫ్యాన్స్ నుండి మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రం తర్వాత వెంటనే ఆయన ప్రశాంత్ నీల్ తో చెయ్యబోయే సినిమాకి షిఫ్ట్ అవుతాడని అందరూ అనుకున్నారు. కానీ మధ్యలో బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ ‘వార్ 2’ హృతిక్ రోషన్ తో కలిసి నటించబోతున్నాడు. 2019 వ సంవత్సరం లో విడుదలైన సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ‘వార్’ చిత్రానికి ఇది సీక్వెల్.
అయితే ఈ చిత్రం లో ఎన్టీఆర్ పాత్రకి హీరోయిన్ ఉండదట.ఈ వార్త ఇప్పుడు అభిమానులను కలవర పెడుతుంది. అసలు ఎన్టీఆర్ ఈ చిత్రం లో ఎలాంటి రోల్ చెయ్యబోతున్నాడు?, ‘వార్’ చిత్రం లో టైగర్ ష్రాఫ్ పోషించిన పాత్ర తరహాలోనే ఎన్టీఆర్ పాత్ర ఉంటుందా?, అలాంటి ఊర మాస్ హీరోని సెకండ్ హీరోగానో, లేదా విలన్ గానో చూపిస్తే ఫ్యాన్స్ తట్టుకోగలరా అనే సందేహాలు ఇప్పుడు విశ్లేషకుల్లో మెలుగుతున్న ప్రశ్నలు.
ఈ చిత్రం ఖరారు అయ్యిందని రీసెంట్ గానే హృతిక్ రోషన్ మరియు జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరూ కూడా ఖరారు చేసారు. ఫ్యాన్స్ ఎంతగానో సంతృప్తి చెందారు, కానీ ఈ వార్త విన్నప్పటి నుండి అభిమానుల్లో కాస్త కలవరం మొదలైంది.మరి ఈ చిత్రం గురించి పూర్తి స్థాయిలో క్లారిటీ రావాలంటే మరో రెండు నెలలు వచ్చి చూడాల్సిందే. ప్రస్తుతం ఆయన ద్రుష్టి మొత్తం ‘దేవర’ మీదనే ఉంది.