Simhadri Re Release: టాలీవుడ్ లో ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ ఒక రేంజ్ లో ఉంది. స్టార్ హీరోల అభిమానులు దీనిని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు, ఇప్పటి వరకు స్టార్ హీరోల కెరీర్స్ లో మైలు రాయిగా నిల్చిన ఎన్నో చిత్రాలు విడుదల అయ్యాయి కానీ, ఒక్క సినిమా కూడా పవన్ కళ్యాణ్ నటించిన ‘ఖుషి’ మరియు ‘జల్సా’ రికార్డ్స్ ని కొట్టలేకపోయాయి. పవన్ కళ్యాణ్ ఖుషి చిత్రం రీ రిలీజ్ ఫుల్ రన్ లో దాదాపుగా 8 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసింది.
మొదటి రోజు ఏకంగా నాలుగు కోట్ల 20 లక్షల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టింది. ఇక జల్సా సినిమా కేవలం ఒక్క రోజు మాత్రమే స్పెషల్ షోస్ గా వేశారు. దీనికి సుమారుగా 3 కోట్ల 40 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.ఈ సినిమా వసూళ్లను ఒక్క రోజులో ఎవరు బ్రేక్ చేయలేకపోయారు కానీ, రామ్ చరణ్ ఆరంజ్ చిత్రం ఫుల్ రన్ లో మాత్రం దాటేసింది.
అయితే జల్సా మరియు ఖుషి మూవీ రికార్డ్స్ ని ఎలా అయినా బద్దలు కొట్టాలనే కసితో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. మే 20 వ తేదీన ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానుల కోసం సింహాద్రి సినిమాని రీ రిలీజ్ చెయ్యబోతున్నారు. ఇందుకు సంబంధించి ఎన్టీఆర్ PR టీం భారీ గానే ఖర్చు చేస్తున్నట్టు సమాచారం.లిరికల్ వీడియో సాంగ్ అని కొత్త కాన్సెప్ట్ ని రీ రిలీజ్ ట్రెండ్ లో పరిచయం చెయ్యడమే కాకుండా , థియేటర్స్ లో విడుదల చేయించడం. దానికి తోడు పెద్ద పెద్ద డిస్ట్రిబ్యూటర్స్ చేత ఈ సినిమాని విడుదల అయ్యేలా చేయించడం.
పది రోజులకు ముందే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం అయ్యేలా ప్లాన్ చెయ్యడం, ఇలా పక్కా ప్రణాళిక తో చేసేందుకు ఇప్పటి వరకు రెండు కోట్ల రూపాయిలు ఖర్చు అయ్యిందట. ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు కాబట్టి, కచ్చితంగా ఈ సినిమా ఖుషి మరియు జల్సా మొదటి రోజు రికార్డ్స్ ని బద్దలు కొడుతుందని అంటున్నారు ట్రేడ్ పండితులు.