Kantara 2: జూనియర్ ఎన్టీఆర్.. టాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్న ఆయన దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచారు. త్రిబుల్ ఆర్ సినిమా వచ్చి దాదాపు రెండేళ్లు అయిపోయినప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించి నెక్ట్ మూవీ గురించి ఎలాంటి వార్త బయటకు రాలేదు.
అయితే, తాజాగా ఎన్టీఆర్ గురించి ఓ వార్త కన్నడ పరిశ్రమలో సంచలనంగా మారింది. ఇంతకీ విషయం ఏంటి? అనుకుంటున్నారా? అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి. కాంతార -2 సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నటించడం ఖాయమని కన్నడ మీడియా కోడై కూస్తోందంట.
అతి చిన్న బడ్జెట్ తో రూపొందిన కాంతార సినిమా దేశవ్యాప్తంగా హిస్టరీ క్రియేట్ చేసిందనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. త్రిబుల్ ఆర్, పుష్ప వంటి సినిమాలకు ఏ మాత్రం తీసిపోకుండా కాంతార అంతే పేరు గాంచింది. కన్నడ భాషలో తీసిన సినిమా అయినప్పటికీ ఇండియా అంతా దద్దరిల్లిపోయింది. మోస్తరు ఖర్చుతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కాంతార రికార్డుల మోత మోగించింది.
తాజా సమాచారం మేరకు కాంతార-2 లో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నారన్న వార్త తెగ హల్ చల్ చేస్తుంది. ఎన్టీఆర్ ఇమేజ్ కి ఏ మాత్రం తగ్గకుండా రిషబ్ శెట్టి క్యారెక్టర్ ను రాసుకున్నారట. ఈ క్రమంలోనే ఇటీవలే బెంగళూరుకు వెళ్లిన జూనియర్ ఎన్టీఆర్ రిషబ్ శెట్టిని కలిశారని తెలుస్తోంది. దీంతో ఆ సినిమా కోసం కన్నడ అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు, అభిమానులు భారీ ఆశలు, అంచనాలతో ఎదురు చూస్తున్నారు.