https://oktelugu.com/

జూనియర్ ఎన్టీఆర్ బోరున ఏడ్చేశాడంటున్న మాస్ డైరెక్టర్…?

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ జూనియర్ ఎన్టీఆర్, మాస్ డైరెక్టర్ వీవీ వినాయక్ కాంబినేషన్ లో ఆది, సాంబ, అదుర్స్ సినిమా తెరకెక్కి బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచిన సంగతి తెలిసిందే. వీరి కాంబినేషన్ లో తెరకెక్కిన తొలి సినిమా ఆది కాగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆ సినిమా షూటింగ్ సమయంలో చోటు చేసుకున్న ఆసక్తికర విషయాలను వీవీ వినాయక్ చెప్పుకొచ్చారు. ఆది సినిమాలో నటించే సమయానికి జూనియర్ ఎన్టీఆర్ కు 17 సంవత్సరాలకు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 20, 2020 6:17 pm
    Follow us on

    టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ జూనియర్ ఎన్టీఆర్, మాస్ డైరెక్టర్ వీవీ వినాయక్ కాంబినేషన్ లో ఆది, సాంబ, అదుర్స్ సినిమా తెరకెక్కి బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచిన సంగతి తెలిసిందే. వీరి కాంబినేషన్ లో తెరకెక్కిన తొలి సినిమా ఆది కాగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆ సినిమా షూటింగ్ సమయంలో చోటు చేసుకున్న ఆసక్తికర విషయాలను వీవీ వినాయక్ చెప్పుకొచ్చారు. ఆది సినిమాలో నటించే సమయానికి జూనియర్ ఎన్టీఆర్ కు 17 సంవత్సరాలకు అటూఇటుగా ఉంటాయని.. షూటింగ్ సమయంలో ఆయన చేతికి గాయమైందని తెలిపారు.

    క్లైమాక్స్ ఫైట్ షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ మణికట్టు తెగిందని.. చాలా మందికి ఈ విషయం గురించి తెలియదని అన్నారు. ఆ సమయంలో చాలా భయమేసిందని వినాయక్ చెప్పుకొచ్చారు. ఆ సమయంలో చేతికి రక్తం కారుతుంటే జూనియర్ ఎన్టీఆర్ బోరున ఏడ్చేశాడని.. ఆ తరువాత డాక్టర్ తమను ఇంకా ఇంకా భయపెట్టాడని.. వైజాగ్ కు వెళ్లి ఎన్టీఆర్ కు చికిత్స చేయించామని వెల్లడించారు. ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ తర్వాత నైట్ షూటింగ్ చేసేద్దామని ఎన్టీఆర్ చెప్పాడని సింగిల్ హ్యండ్ తో ఫైట్ చేశాడని తెలిపారు.

    ఆది సినిమా అటు హీరోగా ఎన్టీఆర్ కు, ఇటు దర్శకునిగా వీవీ వినాయక్ కు మంచిపేరు తెచ్చిపెట్టింది. దర్శకునిగా ఆది వినాయక్ కు తొలి సినిమా. వినాయక్ వారం రోజుల్లో కథ రాసి ఎన్టీఆర్ ను ఒప్పించి ఈ సినిమా తీశాడు. కలెక్షన్ల పరంగా కూడా నిర్మాతకు ఈ సినిమా భారీ లాభాలను మిగిల్చింది. ఇదే ఇంటర్వ్యూలో వినాయక్ నాగార్జున కొడుకు అఖిల్ తో తెరకెక్కించిన అఖిల్ సినిమా గురించి కూడా మాట్లాడారు.

    అఖిల్ సినిమా డిజాస్టర్ తరువాత తన పనైపోయిందంటూ కామెంట్లు వచ్చాయని ప్రతి ఒక్కరి కెరీర్ లో గుడ్ టైమ్స్, బ్యాడ్ టైమ్స్ ఉంటాయని.. ఫ్లాప్ సినిమా తీయాలని సినిమాలు ఎవరూ తీయరని వెల్లడించారు. కామెంట్లు చేసే వాళ్లకు పనేముంటుందని అన్నారు. సోషల్ మీడియాలో విమర్శిస్తూ చేసే పోస్టింగుల వల్ల అవతలి వ్యక్తులను బాధ పెట్టడం తప్ప ఎవరికీ ప్రయోజనం ఉండదని చెప్పారు.