Devara Glimpse: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఈరోజు చాలా స్పెషల్. కారణం… ఆయన లేటెస్ట్ మూవీ దేవర నుండి క్రేజీ అప్డేట్ వస్తుంది. నేడు దేవర ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేస్తున్నారు. ఫ్యాన్స్ చాలా కాలంగా దేవర అప్డేట్ కోరుకుంటున్నారు. ఎన్టీఆర్ ఏ వేడుకకు హాజరైన దేవర అప్డేట్ ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అభిమానుల కోరిక మేరకు దేవర నుండి ఫస్ట్ ప్రోమో విడుదల చేస్తున్నారు. దేవర సినిమాపై చాలా అంచనాలున్న నేపథ్యంలో దేవర ప్రోమో ప్రాధాన్యత సంతరించుకుంది.
జనవరి 8న దేవర ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే సమయం చెప్పలేదు. తాజా సమాచారం ప్రకారం దేవర గ్లింప్స్ సాయంత్రం 4:05 నిమిషాలకు విడుదల చేస్తున్నారు. కాబట్టి ఫ్యాన్స్ టైం లాక్ చేసి గంటలు లెక్కబెట్టుకోండి. ఇక ఎన్టీఆర్ ఊరమాస్ రోల్ చేస్తున్నారు. గ్లిమ్ప్స్ లో ఎన్టీఆర్ లుక్, డైలాగ్స్ హైలెట్ కానున్నాయట.
దేవరలో చాలా సన్నివేశాల కోసం విజువల్ ఎఫెక్ట్స్ వాడినట్లు ఇటీవల నిర్మాత కళ్యాణ్ రామ్ వెల్లడించాడు. కాబట్టి యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు దేవర గ్లింప్స్ లో విజువల్స్ అబ్బురపరిచే అవకాశం ఉంది. సముద్రంలో ఫైట్ సన్నివేశాలు దేవరలో ఉన్నాయట. ఫస్ట్ గ్లిమ్ప్స్ లో అవి చూపిస్తారో లేదో చూడాలి. ఇలాంటి అనేక ఆసక్తికర విషయాలతో దేవర గ్లింప్స్ ప్రేక్షకుల ముందుకు రానుంది.
దేవర మూవీలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేశాడనే వాదన ఉంది. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. దర్శకుడు కొరటాల శివ కసితో దేవర చిత్రం చేస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా ఐదు భాషల్లో విడుదల కానుంది. ఎన్టీఆర్ కి జంటగా జాన్వీ కపూర్ నటిస్తుంది. ఆమెకు దేవర ఫస్ట్ సౌత్ ఇండియా చిత్రం. ఇక మెయిన్ విలన్ రోల్ సైఫ్ అలీ ఖాన్ చేస్తున్నాడు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఏప్రిల్ 5న దేవర విడుదల కానుంది.