Site icon OkTelugu

NTR Trivikram Movie: త్రివిక్రమ్ సినిమా మీద క్లారిటీ ఇవ్వబోతున్న ఎన్టీఆర్…

NTR Trivikram Movie

NTR Trivikram Movie

NTR Trivikram Movie: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమాల విషయంలో సరైన క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటివరకు జూనియర్ ఎన్టీఆర్ చేసిన సినిమాలేవి ప్రేక్షకులను అలరించడం లేదు. గతంలో వచ్చిన ‘వార్ 2’ సినిమా ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచిన ఆయన ఇప్పుడు చేయబోయే సినిమాల విషయంలో సైతం చాలా క్లారిటి మెయింటైన్ చేస్తున్నాడు… ఇప్పటివరకు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని శాసిస్తూ ముందుకు దూసుకెళ్తున్న తన తోటి హీరోలతో పోటీ పడలేని పరిస్థితిలో ఎన్టీఆర్ ఉన్నాడు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ చేస్తున్న సినిమాతో భారీ విజయాన్ని సాధిస్తే కూడా పాన్ ఇండియాలో సత్తా చాటుకున్న వాడవుతాడు. లేకపోతే మాత్రం తన మార్కెట్ ని పూర్తిగా కోల్పోయిన వాడవుతాడు.

త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఒక సినిమా చేయబోతున్నాడు అంటు కొన్ని రోజులుగా కొన్ని వార్తలైతే వస్తున్నాయి. ఇక ఈ విషయంలో అటు ఎన్టీఆర్, ఇటు త్రివిక్రమ్ ఇద్దరు క్లారిటిని ఇవ్వాల్సిన అవసరమైతే ఉంది. ఎందుకంటే ఎన్టీఆర్, త్రివిక్రమ్ తో సినిమా చేస్తానని అఫీషియల్ గా అనౌన్స్ చేసినప్పటికి ఆ తర్వాత మళ్లీ అల్లు అర్జున్ తో సినిమా చేయబోతున్నాడు అంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి.

వీళ్ళిద్దరిలో ఆయన ఎవరితో సినిమా చేయబోతున్నాడు అనేది ఇప్పుడు కీలకంగా మారింది. మే 20వ తేదీన జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన క్లారిటి ఇవ్వబోతున్నారట…ఇక జూనియర్ ఎన్టీఆర్ తోటి హీరోలు 2000 కోట్ల మార్కును దాటి ముందుకు దూసుకెళుతున్న క్రమంలో తను కూడా భారీ విజయాన్ని సాధించాల్సిన అవసరమైతే ఉంది.

ఒకవేళ పొరపాటున ఈ మూవీస్ తో డీలా పడిపోతే మాత్రం ఆయన పాన్ ఇండియాలో మరింత వెనుకబడి పోయే ప్రమాదం ఉంది. ఇక ఇప్పుడు ప్రస్తుతం ఉన్న హీరోలందరు పాన్ వరల్డ్ లోకి ఎంటర్ ఇస్తున్న క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియాలోనే సినిమాలు చేయడం పట్ల కూడా పలువురు పలు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు…

Exit mobile version