https://oktelugu.com/

ఎన్టీఆర్ ఆట మొదలు.. ఇక టీఆర్పీ సునామీనే !

జూనియర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ 1 తో తెలుగు బుల్లితెరకు టీఆర్పీ సునామీని పరిచయం చేశాడు. మళ్ళీ బుల్లితెర పై అలాంటి వెలుగులు జిమ్మడానికి మళ్ళీ దర్శనమివ్వడానికి సన్నద్ధం అవుతున్నాడు. ఎన్టీఆర్ కి వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ అనే కార్యక్రమం జెమినీ టీవీలో ప్రసారం అయ్యే రోజు త్వరలోనే రానుంది. కాగా ఈ క్రమంలో ఈ షో షూటింగ్ ఈ రోజు అన్నపూర్ణ స్టూడియోలో మొదలైంది. ఇక ఈ షోలో ఎన్టీఆర్ లుక్ అదిరిపోయింది. […]

Written By:
  • admin
  • , Updated On : July 10, 2021 / 03:14 PM IST
    Follow us on

    జూనియర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ 1 తో తెలుగు బుల్లితెరకు టీఆర్పీ సునామీని పరిచయం చేశాడు. మళ్ళీ బుల్లితెర పై అలాంటి వెలుగులు జిమ్మడానికి మళ్ళీ దర్శనమివ్వడానికి సన్నద్ధం అవుతున్నాడు. ఎన్టీఆర్ కి వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ అనే కార్యక్రమం జెమినీ టీవీలో ప్రసారం అయ్యే రోజు త్వరలోనే రానుంది.

    కాగా ఈ క్రమంలో ఈ షో షూటింగ్ ఈ రోజు అన్నపూర్ణ స్టూడియోలో మొదలైంది. ఇక ఈ షోలో ఎన్టీఆర్ లుక్ అదిరిపోయింది. హిందీలో బాగా ప్రాచుర్యం పొందిన ‘కౌన్ బనేగా కరోడ్ పతి’కి తెలుగు వర్షన్ లో ఎన్టీఆర్ హోస్ట్ కావడంతో ఈ షోకి బాగా ప్లస్ కానుంది. నిజానికి ఇంతకుముందు ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ పేరుతో మా టీవీ కొన్నాళ్ళు ఆ షో నడిపిన సంగతి తెలిసిందే.

    కింగ్ నాగార్జున, మెగాస్టార్ చిరంజీవి గతంలో ఈ షోకి హోస్ట్ గా పని చేశారు. అయితే ఏకంగా చిరంజీవినే హోస్ట్ గా చేసిన ఆశించిన స్థాయిలో ఈ షో తెలుగు వెర్షన్ కి రేటింగ్స్ రాలేదు అన్నది నిజం. దాంతో షో యాజమాన్యం ఈ షోను మధ్యలోనే నిలిపివేశారు. అయితే తాజాగా జెమినీ టీవీ ఆ షో హక్కులను తీసుకొని తనదైన శైలిలో కొత్త పద్దతిలో ఈ షోను మొదలుపెట్టింది.

    ఈ క్రమంలో జెమిని టీవీ చాల కసరత్తులు చేసింది. హోస్ట్ గా ఎవర్నీ పెట్టుకోవాలి, తెలుగులో నిజంగా వాపు కాకుండా బలుపు ఉన్న స్టార్ ఎవరు అని అన్వేషించే ప్రాసెస్ లో తేలిన విషయం అలాంటి స్టార్ తెలుగులో ఉంది ఒక్కడే ఎన్టీఆర్. అందుకే ఈ షో కోసం ఎన్టీఆర్ కి దాదాపు 11 కోట్ల పారితోషికం ఇచ్చి తీసుకున్నారట. మరి బుల్లితెర పై మరోసారి ఎన్టీఆర్ తన ఆట ఏ రేంజ్ లో షురూ చేస్తాడో చూడాలి.