NTR Friends: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. జూనియర్ ఎన్టీఆర్ లాంటి నటుడు సైతం తనదైన రీతిలో సత్తా చాటుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన ‘డ్రాగన్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే 2000 కోట్లకు పైన కలెక్షన్స్ ను కొల్లగొట్టాలనే లక్ష్యంతో ముందుకు దూసుకెళ్తుండడం విశేషం… ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఇంతకు ముందు వచ్చిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు చేస్తున్న ఈ సినిమాలు మరో ఎత్తుగా మారబోతున్నాయి. యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేయగలిగే కెపాసిటి ఉన్న దర్శకుల్లో ప్రశాంత్ నీల్ ఒకరు కావడం విశేషం… ఇక జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాతో తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకోవాల్సిన సమయమైతే ఆసన్నమైంది. ఎందుకంటే తన తోటి హీరోలందరు వరుస సక్సెస్ లను సాధిస్తున్నారు.
భారీ విజయాలను కొల్లగొడుతూ సినిమా ఇండస్ట్రీని సైతం శాసించే స్థాయికి వెళ్ళిపోతున్నారు. ఇక ఇలాంటి క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే వెనకబడిపోవడం అతని అభిమానులను బాధిస్తుంది…జూనియర్ ఎన్టీఆర్ ఈ మధ్యకాలంలో తన ఫ్రెండ్స్ ఎవరిని పెద్దగా కలవడం లేదట. ఒకప్పుడు రాజీవ్ కనకాలతో తను చాలా సన్నిహితంగా ఉండేవాడు.
కానీ గత కొద్దిరోజుల నుంచి రాజీవ్ కనకాలతో కూడా పెద్దగా కలవడం లేదట. ఇక ఫామిలీ పనుల్లో బిజీగా ఉంటున్న జూనియర్ ఎన్టీఆర్ సమయం దొరికిన ప్రతిసారి తన ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి ఇష్టపడుతున్నారట. అంతే తప్ప బయట ఫ్రెండ్స్ తో కలిసి పార్టీలు పబ్బులు అంటూ తిరిగే పరిస్థితి లేదంటూ తను తన సన్నిహితుల దగ్గర చెబుతున్నట్టుగా తెలుస్తుంది.
మొత్తానికైతే జూనియర్ ఎన్టీఆర్ గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో ఎక్కువగా తన ఫ్యామిలీతో స్పెండ్ చేస్తున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక సినిమా షూటింగ్ సమయంలో లొకేషన్ లోనే ఉంటూ బిజీగా గడుపుతున్న ఆయన షూటింగ్ లేని సమయంలో ప్రతిసారి ఫ్యామిలీతోనే స్పెండ్ చేస్తుండటం విశేషం…
