
నేషనల్ గ్రేట్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా వస్తోన్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా అక్టోబర్ 13న రానుంది. మరి, ఎన్టీఆర్-రామ్ చరణ్ కు ఈ అక్టోబర్ ఎంతవరకూ కలిసొస్తుందనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. గతంలో ఎన్టీఆర్, చరణ్ సినిమాలు అక్టోబర్ నెలలో ఏవి రిలీజ్ అయ్యాయి. వాటి రిజల్ట్ ఏంటి ? లాంటి విషయాలు గురించి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కాగా అక్టోబర్ లో ఎన్టీఆర్ సినిమాలు చాలా రిలీజ్ అయ్యాయి. ముందుగా బృందావనం, ఊసరవెల్లి, రామయ్యా వస్తావయ్యా, అరవింద సమేత లాంటి సినిమాలన్నీ అక్టోబర్ లోనే రిలీజ్ అయ్యాయి. కాకపోతే వీటిలో బృందావనం ఒక్క సినిమా మాత్రమే ఎన్టీఆర్ కెరీర్ కి ఉపయోగ పడింది. ఇక చరణ్ విషయానికొస్తే.. గోవిందుడు అందరివాడే, బ్రూస్ లీ లాంటి సినిమాలు అక్టోబర్ లో రిలీజ్ అయి ఫ్లాపులుగా నిలిచాయి.
ఎన్టీఆర్ తో పోలిస్తే.. చరణ్ కెరీర్ లో అక్టోబర్ ఒక బ్యాడ్ మంత్ లా నిలిచిపోయింది. మరి ఈ ఇద్దరు హీరోలకు అక్టోబర్ ఎంతవరకూ కలిసి వస్తోందో చూడాలి. ఇక అజయ్ దేవగన్, శ్రియ శరన్, సముద్రఖని, అలియా భట్ లాంటి నటీ నటులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక చరణ్ అల్లూరి సీతారామరాజుగా, తారక్ కొమురం భీమ్ గా నటిస్తున్నారు. భారీ వ్యయంతో ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.