Choreographer Johnny Master
Johnny Master : గత ఏడాది లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ అరెస్ట్ వ్యవహారం ఎంతటి సంచలనం రేపిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. దేశవ్యాప్తంగా ఈ అంశంపై చర్చ నడిచింది. సుమారుగా నెల రోజుల పాటు చంచల్ గూడ జైలులో రిమాండ్ లో ఉంటూ, రెగ్యులర్ బెయిల్ మీద బయటకొచ్చి, మళ్ళీ వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు. జైలులో ఉన్న సమయంలోనే ఆయనకి ప్రకటించిన నేషనల్ అవార్డు రద్దు అయ్యింది. అంతే కాకుండా డ్యాన్సర్స్ అసోసియేషన్ పదవి నుండి కూడా ఆయన్ని తప్పించారు. రీసెంట్ గానే ఈ పదవి కి ఎన్నిక జరిగింది. ఒక అసోసియేషన్ మెంబెర్ గా ఉన్న నాకు చెప్పకుండా, ప్రెసిడెట్ ని ఎంచుకోవడం కరెక్ట్ కాదని, దీనిపై నేను న్యాయపోరాటం చేస్తానంటూ జానీ మాస్టర్ కోర్టు మెట్లు ఎక్కాడు. అయితే ఈ అంశంపై కాసేపటి క్రితమే జానీ మాస్టర్ పెట్టిన ఒక పోస్ట్ ట్విట్టర్ లో బాగా వైరల్ అయ్యింది.
ఇంతకు ఆయన ఏమన్నాడంటే ‘కోర్టు ఆర్డర్లపై కూడా తమ స్వలాభం కోసం కొంతమంది తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. వాళ్ళని చూస్తే నాకు చాలా జాలేస్తుంది. ముందుగా నాకు సమాచారం అందించకుండా జరిగిన ప్రెసిడెంట్ ఎన్నికలపై నేను పెట్టిన కేసుకి కోర్టు ఇచ్చిన తీర్పు వేరు, దానికి మరో కేసుని లింక్ చేస్తూ సోషల్ మీడియా లో చేస్తున్న ప్రచారం చేస్తున్నారు. మీరే చెప్పే కబుర్లు ప్రస్తుతానికి జనాలు ప్రభావితమై నమ్ముతారేమో. కానీ కోర్టు తీర్పుని ఎవ్వరూ మార్చలేరు. అది వచ్చిన రోజున మీ నిజస్వరోపమేంటో జనాలు మొత్తం చూస్తారు. ఏమి ఆశించి ఈ దుష్ప్రచారం చేస్తున్నారు అనేది ఆరోజు అందరికీ అర్థం అవుతుంది. చివరికి న్యాయమే గెలుస్తుంది, నిజం జనాలందరికీ తెలుస్తుంది’. అంటూ చెప్పుకొచ్చాడు. ఆయన పెట్టిన ఈ పోస్ట్ క్రింద ఎక్కువ శాతం మంది నెటిజెన్స్ సపోర్టుగా నిలబడడం ఆశ్చర్యానికి గురి చేసే విషయం.
మరోపక్క జానీ మాస్టర్ పై కేసు వేసిన అమ్మాయి శ్రేష్టి వర్మ కూడా ఇటీవలే ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూ లో జానీ మాస్టర్ పై ఆమె అనేక కామెంట్స్ చేసింది. కోర్టులో ఒక అంశం పై కేసు నడుస్తున్నప్పుడు, ఆ అంశానికి సంబంధించిన నిందితులు, లేదా బాధితులు మీడియా ముందుకొచ్చి మాట్లాడేందుకు అనుమతి లేదు. కానీ శ్రేష్టి వర్మ ఏకంగా ఇంటర్వ్యూ ఇచ్చి జానీ మాస్టర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. మరి దీనిపై కోర్టు శ్రేష్టి వర్మ మీద చర్యలు తీసుకుంటుందా లేదా అనేది చూడాలి. ప్రస్తుతం ఆమె ఇండస్ట్రీ లో మెయిన్ కొరియోగ్రాఫర్ గా దూసుకుపోతుంది. పుష్ప 2 చిత్రంలో అనేక పాటలకు ఈమె మెయిన్ కొరియోగ్రాఫర్ గా చేసింది. జానీ మాస్టర్ జైలుకు వెళ్ళడానికి, ఈమె కొరియోగ్రాఫర్ అవ్వడానికి వెనుక ఇండస్ట్రీ కి చెందిన ప్రముఖుల హస్తం ఉందని ప్రచారం జరుగుతుంది. ఇందులో ఎంత వరకు నిజముందో చూడాలి.